World Book Day : ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా

ఈరోజు ప్రపంచ (మంగళవారం) పుస్తక దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ పుస్తక దినోత్సవానికి ఓ థీమ్‌ను ప్రకటించారు. ఈ ఏడాది థీమ్ 'రీడ్‌ యూవర్ వే'. పుస్తక దినోత్సం ఎందుకు జరుపుకుంటారనే దానిపై విభిన్న కథనాలు ఉన్నాయి. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి.

New Update
World Book Day : ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా

Reading Books : చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురజాడ అప్పారావు(Gurajada Apparao) అన్నారు. ఒకమంచి పుస్తకం దగ్గర ఉంటే.. వేయిమంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు. పుస్తకం చదివేటప్పుడు అందులో ఉండే అక్షరాలు, పదాలు, సన్నివేశాలు, పాఠకున్ని లీనం చేసుకుంటాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు. అలాగే వారు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జీవితం(Life) లో ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఎంతోమంది వారి జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను అక్షర రూపంలో అందించి ధైర్యం ఇస్తుంది పుస్తకం. అలాగే ఆత్మవిశ్వాసం పెంచేలా దోహదం చేస్తుంది పుస్తకం.

Also read: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఓసారి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) మాట్లాడుతూ.. నా భార్య బిడ్డలకన్న పుస్తకమే నాకు ఎక్కువ అన్నారు. ఆ కాలంలో పుస్తకాలకు అంతగా విలువ ఉండేది. కానీ ప్రస్తుతం పుస్తకాలు చదివే పాఠకులు సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. స్మార్ట్‌ఫోన్ల ప్రభావతంతో చాలామంది సెల్‌ఫోన్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే అవి ఎంతో మేలు చేస్తాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ప్రపంచ (మంగళవారం) పుస్తక దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ పుస్తక దినోత్సవానికి ఓ థీమ్‌ను ప్రకటించింది యునెస్కో. ఈ ఏడాది థీమ్ 'రీడ్‌ యూవర్ వే'. ఈ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడంపై విభిన్నమైన కథలున్నాయి.

17వ శతాబ్దంలో యూరప్‌లో ఈరోజును సెయింట్ జార్డ్ డే పాటిస్తుండేవారు. స్పెయిన్(Spain) దేశంలో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. అంతేకాదు షోక్సిపియర్, ఇన్కా, గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616లో ఇదే రోజు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు జన్మించడం లేదా మరణించడం జరగడం అనేది పుస్తక దినోత్సవం జరుపుకోవడానికి ఓ కారణం. అయితే వేరువేరు దేశాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినప్పటికీ కూడా.. ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని(World Book Day) పాటించాలని 1955లో యునెస్కో(UNESCO) ప్రకటించింది. అంతేకాదు ఇదే రోజును కాపీ హక్కుల దినోత్సవంగా జరపాలని, రచయితలు, ప్రచూరణకర్తలు, పాఠకులు, టీచర్లను గౌరవించాలని సూచించింది. అలాగే ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో ఉన్న స్టార్స్‌బర్గ్ అనే నగరాన్ని పుస్తక రాజధానిగా ప్రకటించింది యునెస్కో.

Also Read: పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే

Advertisment