T20 womens world cup: ఎట్టకేలకు మహిళల టీ20 ప్రపంచకప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీని యూఏఈలో నిర్వహించబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ మేరకు ‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహించలేకపోతున్నాం. ఇది ఎంతో నిరాశ కలిగిస్తోంది. బంగ్లా బోర్డు గొప్పగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కానీ అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఒక ఐసీసీ టోర్నీని అక్కడ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తాం. మెగా టోర్నీకి అతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎమిరేట్స్ బోర్డుకు అభినందనలు' అంటూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ తెలిపాడు. ఇక యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది.