T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్ టూ యూఏఈ! మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను ఐసీసీ మార్చింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. By srinivas 21 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి T20 womens world cup: ఎట్టకేలకు మహిళల టీ20 ప్రపంచకప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీని యూఏఈలో నిర్వహించబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. The ninth edition of ICC Women’s #T20WorldCup to be held in October 2024 has been relocated to a new venue. Details 👇https://t.co/20vK9EMEdN — ICC (@ICC) August 20, 2024 ఈ మేరకు ‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహించలేకపోతున్నాం. ఇది ఎంతో నిరాశ కలిగిస్తోంది. బంగ్లా బోర్డు గొప్పగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కానీ అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఒక ఐసీసీ టోర్నీని అక్కడ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తాం. మెగా టోర్నీకి అతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎమిరేట్స్ బోర్డుకు అభినందనలు' అంటూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ తెలిపాడు. ఇక యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. #icc #uae #womens-t20-world-cup-2024 #bangaladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి