CM REVANTH: కల్వకుర్తిలో సీఎం రేవంత్‌కు నిరసన సెగ.. మహిళల ఆందోళన! కల్వకుర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌కు నిరసన సెగ తగిలింది. 'దయగల సీఎం మాకు 80 లక్షల బడ్జెట్ డబుల్ బెడ్రూమ్‌లు కేటాయించండి' అంటూ పలువురు మహిళలు ప్లకార్డులు చూపించారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. By srinivas 28 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kalwakurthy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌కు నిరసన సెగ తగిలింది. కల్వకుర్తి సభలో రేవంత్ మాట్లాడుతుండగా కొంతమంది మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. సభ మధ్యలో నిలబడిన మహిళలు 'దయగల సీఎం మాకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వండి. 80 లక్షల బడ్జెట్ డబుల్ బెడ్రూమ్ లు కేటాయించండి' అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని చూపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళల దగ్గర నుండి ప్లకార్డులు లాక్కుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆయన వల్లే పదవులకు గౌరవం.. ఈ మేరకు ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించిన సీఎం.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. ఇది కూడా చదవండి: Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం! కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి.. అలాగే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, రహదారుల కోసం రూ.180కోట్లు మంజూరు చేస్తాం. ఆమన్‌గల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రహదారి తెస్తాం. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా మాట్లాడాం. నేను చదువుకున్న తాండ్ర హైస్కూల్ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నా. కల్వకుర్తిలో నిరుద్యోగం పారదోలడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మాడగుల మండల కేంద్రంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక జులై 31 లోపే రెండో విడత రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో ముచ్చెర్లలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుండుసున్నానే వస్తుందంటూ విమర్శలు చేశారు. #kalwakurhty #double-bed-room-issue #cm-revant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి