Guinness World Records: వామ్మో..ఒట్టిచేత్తో పాన్‌ను మడతెట్టేసిన మహిళలు

కొందరు మహిళలు ఫ్రైయింగ్‌ పాన్‌లను చపాతీల్లా మడతపెడుతున్న వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. గిన్నీస్ రికార్డ్‌ కోసం నిమిషంలో ఎక్కువ పాన్‌లను ఎవరు రోల్‌ చేస్తే వారికే రికార్డ్‌ దక్కుతుంది. చివరికి ఇద్దరు మహిళలు స్పీడ్‌గా బలాన్ని ఉపయోగించి పాన్‌లను స్పీడ్‌గా రోల్‌ చేశారు.

Guinness World Records: వామ్మో..ఒట్టిచేత్తో పాన్‌ను మడతెట్టేసిన మహిళలు
New Update

Guinness World Records: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తులకు అందజేస్తుంటారు. ఒకరు తలతో బాటిల్ మూతలను ఓపెన్‌ చేస్తే మరొకరు కడుపు మీద పుచ్చకాయలను పగులగొట్టుకుంటూ రికార్డులు బ్రేక్‌ చేస్తుంటారు.

publive-image

ఇలాంటి విచిత్రమైన విన్యాసాలు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంటాయి. తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వాళ్లు పంచుకున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు మహిళలు ఫ్రైయింగ్‌ పాన్‌లను చపాతీల్లా మడతపెడుతున్న వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

publive-image

ప్రపంచ రికార్డ్‌ కోసం నిమిషంలో ఎక్కువ పాన్‌లను ఎవరు రోల్‌ చేస్తే వారికే రికార్డ్‌ దక్కుతుంది. ఇందు కోసం చాలా మంది మహిళలు పోటీలు పడ్డారు. చివరికి ఇద్దరు మహిళలు స్పీడ్‌గా బలాన్ని ఉపయోగించి పాన్‌లను స్పీడ్‌గా రోల్‌ చేశారు. జానా వాస్కోవా, మిహేలా-ఆండ్రీయా బ్రింజోయులు ఫైన్‌లో సమానంగా నిలిచారు.

ఈ జంట గతంలో ఇటాలియన్ TV షోలో ఏడుగురి రికార్డును అధిగమించారని నిర్వాహకులు అంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనితో పాటు మరికొన్ని ఫీట్‌లను పంచుకుంది. ఓ వ్యక్తి కప్పు కాఫీని వేగంగా తాగి సరికొత్త రికార్డు సృష్టించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఆ వ్యక్తి కేవలం 3.12 సెకన్లలో కాఫీ మొత్తం తాగేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: కనురెప్పలు ఎందుకు వాస్తాయి?.. నివారణ మార్గాలు ఇవే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#guinness-world-records #pan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe