Women Health: సి-సెక్షన్ లేదా సాధారణ ప్రసవం తర్వాత చల్లటి నీరు తాగకూడదు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలు తరచుగా చెప్తుంటారు. ఎప్పుడు నీళ్ళు తాగినా వేడి నీళ్ళు మాత్రమే తాగాలని సూచిస్తారు. చల్లటి నీళ్ళు తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, మ్యాటర్ ఏంటంటే.. సి-సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ కొందరికి పొట్ట వచ్చినట్లుగా ఉంటుంది. అది కొందరిలో తగ్గుతుంది.. మరికొందరిలో అలాగే ఉండిపోతుంది. అయితే, డెలివరీ తరువాత చల్లటి నీరు తాగడం వల్ల ఈ పొట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
వాస్తవానికి నీళ్లు తాగడానికి కూడా ఒక మార్గం ఉందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. చాలా మంది దీనిని పట్టించుకోరు. వైద్యుల ప్రకారం.. ప్రసవం తర్వాత సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను అనుసరించడం చాలా ముఖ్యం. దీంతో పాటు సరైన విధంగా తాగునీటిని కూడా తాగాలి. ఈ కారణంగా, మీ పొట్ట అస్సలు ఉబ్బిపోదు. మీరు మళ్లీ మునుపటిలా ఫిట్‌గా, చక్కగా కనిపిస్తారు. మరి నీళ్లు తాగడానికి సరైన మార్గం ఏంటి? ముఖ్యంగా డెలవరీ అయిన స్త్రీలు నీటిని ఎలా తాగాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు తాగడానికి సరైన మార్గం..
వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు. కొంచెం కొంచెం తాగాలి. క్రమం తప్పకుండా నీళ్లు తాగడం వలన శరీరం, చర్మానికి అవసరమైనంత నీరు అందుతుంది. అయితే, నీళ్లను కూర్చొని, ప్రశాంతంగా తాగాలి.
డెలివరీ తర్వాత ఎంత నీరు తాగాలి?
డెలివరీ తర్వాత.. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి. మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. మీరు ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగటం చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి పాలలో 80% నీరు ఉంటుంది.
వెన్ను, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం..
డెలివరీ తర్వాత.. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి. ఇది నడుము, వెన్నునొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. డెలివరీ తర్వాత బాడీ పెయిన్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
రోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి..
డెలివరీ తర్వాత తక్కువ నీరు తాగాలని చాలా మంది అంటుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెలివరీ తర్వాత.. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. తద్వారా మీ శరీరం డీహైడ్రేట్‌కు గురి కాకుండా ఉంటుంది. అలాగే బరువును నియంత్రిస్తుంది.
వేడి నీళ్లు తాగాలా? చల్లని నీళ్లు తాగాలా?
ప్రసవానంతరం వేడినీళ్లు మాత్రమే తాగాలని పెద్దలు మొదలు ఆరోగ్య నిపుణుల వరకు సూచిస్తుంటారు. డెలివరీ అనంతరం గది ఉష్ణోగ్రత వద్ద నీళ్లను తాగాలి. చాలా చల్లటి లేదా వేడి నీటిని తాగడం శరీరానికి హానికరం.
ప్రసవానంతరం నీళ్లు ఎక్కువ తాగితే ఏమవుతుంది..
వైద్యుల ప్రకారం, డెలివరీ తర్వాత నీరు త్రాగటం చాలా ముఖ్యం. ఎందుకంటే డెలివరీ తర్వాత శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. చర్మం కూడా చాలా డల్ అవుతుంది. డీహైడ్రేషన్, జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి పరిస్థితిలో.. సరైన పద్ధతిలో, సరైన పరిమాణంలో నీళ్లు తాగితే.. ఈ సమస్య కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
యూరిన్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ..
సి-సెక్షన్ లేదా కొన్నిసార్లు సాధారణ డెలివరీ తర్వాత కూడా చాలా మంది మహిళలు డీహైడ్రేషన్ కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది మహిళలు నొప్పి, మంటతో బాధపడుతుంటారు. అలాంటి పరిస్థితిలో.. ఎక్కువ నీరు త్రాగితే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు. ఆరోగ్య సంబంధిత సందేహాలు ఏమైనా ఉంటే.. వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలను పాటించడం ఉత్తమం.