Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆరోగ్యంమే మహాభాగ్యమని పెద్దలు అంటు ఉంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి వలన ఊహించని రోగాలు వస్తున్నాయి. కొన్ని ఆహారాల వలన కూడా త్వరగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మించిన సంపదలేదు కారోన అందరికి అర్థమైనలా చేసింది. కానీ ఇప్పుడున్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం వలన ఇప్పటికే ఉన్న రోగాలు కొత్త కొత్త రోగాలు వెంటాడుతున్నాయి. చిన్న వ్యాధులు, అంటువ్యాధులు పోయి, కరోనా లాంటి డేంజరస్ వ్యాధులు మనుషులన్ని వేధిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధులకు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం అధికం:
- అయితే తాజాగా పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు నిపుణులు. వచ్చే 25 సంత్సరాలలో అంటే (2050) వరకు 100 కోట్ల మందికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 59 కోట్ల మంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని అంటున్నారు. ఈ సంఖ్య 2050 కల్లా 100 కోట్లను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆర్థరైటిస్‌ను వాడుక భాషలో జాయింట్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధిబారిన పడినవారిని కీళ్లు చాలా ఇబ్బంది పెడుతాయి.
మహిళల్లో వాధి లక్షణాలు ఎక్కువ:
- ఈ సమస్య ఉన్నవాళ్ల కాళ్ల వాపురావడం, నడవలేకపోవడం, ఏ పని చేయలేకపోతుంటారు. అయితే.. ఇది ఎక్కువగా ఎముక చివరి భాగమైన మృదులాస్థి అరిగిపోవడం వలన వస్తుందని చెబుతున్నారు. మృదులాస్థి సాధారణంగా 25-30 ఏళ్ల వరకు ఉంటుందట. అది కోల్పోయాక దాదాపు ప్రతి ఒక్కరికీ 60 ఏళ్ల వయస్సులో కీళ్లనొప్పులు వస్తుంటాయని అంటున్నారు. అంతేకాకుండా వృద్ధాప్యం ఈ వ్యాధికి ప్రధాన కారణమౌతుందటున్నారు. ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉంది. ఎందుకంటే మహిళల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగాఉంటాయి కావున వారు త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.