ట్రైన్‌లో ప్రసవించిన మహిళ

గర్భిణి ట్రైన్‌లో డెలివరీ అయింది. ఈ ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహమూదా బేగం తన కూతురు అర్సియా అభస్సుం బేగంతో బంధువుల ఇంటికి బయలు దేరగా.. మార్గ మధ్యలో అర్సియా అభస్సుం బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తోటి ప్రయాణికులు ప్రసవం చేశారు.

New Update
ట్రైన్‌లో ప్రసవించిన మహిళ

గర్భిణి ట్రైన్‌లో డెలివరీ అయింది. ఈ ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహమూదా బేగం తన కూతురు అర్సియా అభస్సుం బేగం (గర్భిణి)తో కలిసి తమ బంధువుల ఇంటికి బయలు దేరింది. ట్రైన్‌ మమబూబ్‌ నగర్‌ రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం గర్భిణికి పురుటినొప్పులు వచ్చాయి. వెంటనే స్పందించిన తొటి ప్రయాణికులు ముందుగా ట్రైన్‌ చైన్‌ లాగడానికి ప్రయత్నించారు. దగ్గర్లో పట్టణాలు కూడా లేకపోడంతో చైన్‌ లాగా సాహసం చేయలదు.

మరోవైపు గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో చేసేది ఏం లేక ప్రయాణికులే గర్భిణికి డెలివరీ చేశారు. దీంతో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రైలు జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు తల్లి బిడ్డలను 108 సహాయంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మహమూదా బేగం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు, స్థానికులు స్పందించి వారికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ముందుగా మహమూదా బేగం, అర్సియా అభస్సుం బేగం మహబూబ్‌ గనర్‌లో ట్రైన్ దిగాల్సి ఉంది. ట్రైన్‌ దిగిన మహిళ తాము దిగాల్సిన స్టేషన్‌ ఇది కాదని భావించి మళ్లీ రైలు ఎక్కారు. ట్రైన్‌ అక్కడి నుంచి బయలు దేరిన కొద్ది సేపటికి గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు