Crime News: ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపిన ప్రియుడు..

మహారాష్ట్రలోని పుణెలో ఓయో టౌన్‌ హౌస్‌ హోటల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని ఆమె ప్రియుడు తుపాకితో కాల్చి చంపాడు. వీళ్లిద్దరు గత పదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారని.. వందన ప్రవర్తనపై అనుమానంతో రిషబ్ ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Crime News: ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపిన ప్రియుడు..

భార్యభర్తలు, లవర్స్‌ మధ్య చిన్నచిన్న గొడవలు సాధారణమే. కానీ ఈ గొడవలు తీవ్రతరం కావడంతో ఈమధ్య ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే ఆ మధ్య పెళ్లి కాకుండానే జంటలు సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌) చేసే కొత్త ట్రెండ్ వచ్చింది. ఇందులో కూడా కొందరు తమ ప్రేమికులను చంపుకున్న ఘటనలు కూడా ఇటీవల జరిగాయి. అయితే తాజాగా ఓ ప్రియుడు తన ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది.

మహారాష్ట్రలోని పుణెలో ఓయో టౌన్‌ హౌస్‌ హోటల్‌లో శనివారం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. హోటల్‌లో ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. చివరికి నిందితుడు రిషబ్‌ నిగమ్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని వందన ద్వివేదిగా గుర్తించారు.

Also Read: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట

పదేళ్లుగా కలిసుంటున్నారు

పుణెలోని హింజవాడిలో ఉన్న ఐటీ కంపెనీలో వందన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రిషబ్‌ సొంత స్థలం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో. వీళ్లిద్దరూ గత పదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అయితే వందనను కలిసేందుకు జనవరి 25న రిషబ్‌ పుణెకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హింజవాడిలో ఉన్న ఓయో టౌన్ హౌస్‌ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఈ తర్వాత రిషబ్.. వందనను తుపాకితో కాల్చి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోయాడు.

వందన ప్రవర్తనపై అనుమానం

అయితే రిషబ్ వందనను చంపేందుకు పక్కా ప్లాన్‌తో లక్నో నుంచి పుణెకు వచ్చాడని పోలీసులు తెలిపారు. వందన ప్రవర్తనపై రిషబ్ అనుమానం పెంచుకున్నాడని తెలిపారు. వందనను తుపాకితో కాల్చిన తర్వాత శనివారం రాత్రి 10 గంటలకు హోటల్‌ నుంచి రిషబ్‌ బయటికి వెళ్లిపోయినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు చెప్పారు. చివరికి ముంబైలో రిషబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:  ప్రాజెక్టుల ఆలస్యంతో లక్షల కోట్లు పెరుగుతున్న ఖర్చు..  ఆర్థికవ్యవస్థపై భారం 

Advertisment
తాజా కథనాలు