Cyber Crime: ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌.. రూ.19 లక్షలు హాంఫట్‌!

హైదరాబాద్‌లోని ఓ విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరస్థుల వలలో పడి 19.23లక్షలు పోగొట్టుకుంది. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్‌ చేసిన నిందితుడు బాధితురాలి బ్యాంకుఖాతా నంబరు, వివరాలు రాబట్టి బురిడి కొట్టించాడు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్  క్లిక్ చేశారో అంతే సంగతులు..!!

హైదరాబాద్‌లో ఓ విశ్రాంత ఉద్యోగిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌తో రూ.లక్షలు కాజేశారు. సదరు విశ్రాంత ఉద్యోగి.. వారం రోజుల క్రితం ఇంటర్నేట్‌లో బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నంబర్ సేకరించారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొంత సమయానికి బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నంటూ ఓ వ్యక్తి వాట్సప్‌ ఫోన్‌కాల్‌ చేశాడు. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్‌ చేశాడు. బాధితుడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆయన ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాడు. ఆ సమాచారం, స్క్రీన్‌షాట్లు తన నంబరుకు తెప్పించుకున్నాడు. అనంతరం బాధితురాలి బ్యాంకుఖాతా నంబరు వివరాలు రాబట్టాడు.

Also Read: భూకబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

రెండ్రోజుల తరువాత విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఖాతానుంచి దఫాల వారీగా ఏకంగా రూ.19.23లక్షలు వేర్వేరు ఖాతాల్లోకి జమయినట్టు ఫోన్‌కు సందేశాలు రావడంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. అనంతరం బాధితుడి భార్య ఫోన్‌ నంబర్‌కు వాట్సప్‌ కాల్‌ చేసి బ్యాంకు వివరాలు చెప్పమంటూ అడగటంతో తిరస్కరించారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు నిత్యం ఎక్కడో ఓ చోట చేసుకుంటూనే ఉన్నాయి. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరస్థుల వలలో పడుతున్నారు. సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా మళ్లీ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయినట్లు గ్రహిస్తే.. వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Also read: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక..

Advertisment
Advertisment
తాజా కథనాలు