AI: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో రూ.1.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

ఢిల్లీలో ఉన్న ఓ మహిళకు ఓ సైబర్ కేటుగాడు బురిడి కొట్టించి రూ.1.4 లక్షలు కాజేశాడు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో.. అచ్చం ఆ మహిళ అల్లుడిలాగే మాట్లాడి తాను ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు పంపాలని చెప్పి మోసం చేశాడు. చివరికి నిజం తెలుసుకోని ఆమె పోలీసులను ఆశ్రయించారు.

AI: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో రూ.1.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
New Update

ఓవైపు సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నా కూడా మరోవైపు దాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు కూడా పెరగడం ఆందోళనలు కలిగిస్తోంది. ప్రస్తుతం అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వేగంగా దూసుకుపోతోంది. దీని సాయంతో అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికే డీఫ్ ఫేక్ లాంటి వీడియోలు ఇటీవల బయటపడటం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అంతేకాదు ఏఐ సాయంతో వాయిస్‌ను కూడా ఇమిటేట్‌ చేసి డబ్బులు కాజేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఉన్న ఓ మహిళకు అర్థరాత్రి ఫోన్ రావడంతో ఆమె ఫోన్‌ లిఫ్ట్ చేసింది. కెనడాలో ఉన్న ఆమె అల్లుడి వాయిస్‌లాగే ఓ సైబర్ నేరగాడు ఆ మహిళతో వారి స్థానిక భాషలో మాట్లాడాడు.

Also read: ప్రేమకు అంగీకరించలేదని యువతి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి..

తనకు యాక్సిడెంట్‌ అయ్యిందని పోలీసులు జైలుకు తీసుకెళ్లనున్నారని.. అర్జెంట్‌గా డబ్బులు కావాలని ఆమెను అభ్యర్థించాడు. ఈ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పొద్దంటూ ఆమెను నమ్మించాడు. దీంతో ఇది నిజమనుకోని నమ్మిన ఆమె రూ.1.4 లక్షల రూపాయలు అతడికి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత ఆ మహిళా.. ఇటీవలే కెనడాకు వెళ్లిన తన అల్లుడికి వీడియో కాల్ చేశాక తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా.. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వాయిస్ ఇమిటేటింగ్ టూల్‌తో ఎవరి వాయిస్‌నైనా అచ్చం వారు మాట్లాడుతున్నట్లుగానే మార్చవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ కేటుగాళ్లు తమ ఓరిజినల్ వాయిస్‌లో మాట్లాడినా కూడా.. టార్గెట్ చేసిన వ్యక్తి వాయిస్‌ వచ్చేలా ఏఐ చేస్తుందని అంటున్నారు. ఇలాంటి కాల్స్‌తో తాము ఇబ్బందిలో ఉన్నామని చెప్పి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కెనడా, ఇజ్రాయెల్‌లో కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వారు ఇలాంటి ఏఐ వాయిస్‌ మోసాలకు బలైపోతున్నట్లు వెల్లడిస్తున్నారు.

#artificial-intelligence #telugu-news #national-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe