police vs women: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ..అసలేం జరిగిందంటే నడి రోడ్డు మీద ఓ పోలీసు అధికారిని(police officer) మహిళ (women) చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన పోలీసు ఆమెను కాలితో తన్నాడు. ఈ విషయం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో(social media) పెట్టడంతో వైరల్(virul) గా మారింది. By Bhavana 03 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి నడి రోడ్డు మీద ఓ పోలీసు అధికారిని(police officer) మహిళ (women) చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన పోలీసు ఆమెను కాలితో తన్నాడు. ఈ విషయం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో(social media) పెట్టడంతో వైరల్(virul) గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర్ ప్రదేశ్‌లో సోమవారం ఓ మహిళ ఆటోలో ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో పానిగావ్ లింక్ రోడ్ నుంచి కైల్సా నగర్ కు వచ్చే మలుపు వద్ద ఆ ఆటోను ఓ పోలీసు అధికారి ఆపాడు. డ్రైవర్ తో మాట్లాడిన తరువాత ఆటో లోపల కూర్చున్న మహిళతో పోలీసు అధికారి అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె మీద చేయి వేసేందుకు ప్రయత్నించాడు. Also read:రజనీ కాంత్ సినిమాలో రానా..క్లారిటీ ఇచ్చిన సినిమా బృందం! దీంతో కోపాద్రిక్తురాలైన మహిళ ఆ పోలీసు అధికారిని చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పోలీసు అధికారి ఆమెను కాలితో తన్నాడు. దాంతో ఆమె రోడ్డు మీద పడిపోయింది. అక్కడితో ఆగకుండా పోలీసు అధికారి ఆమె మీద దాడికి ప్రయత్నించాడు.దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి అతనిని ఆపాడు. ఈ గొడవనంతటిని కూడా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసు అధికారి తనతో ప్రవర్తించిన విధానం గురించి ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. దీని గురించి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. यूपी पुलिस: महिला को पुलिस कर्मी लात मार रहा और महिला चप्पल जड़ रही है...।ये वायरल वीडियो मथुरा का बताया जा रहा है, महिला सुरक्षा की बीच चौराहा धज्जियां उड़ाई जा रही है...। वाया-@rishabhmanitrip pic.twitter.com/LcfEL3titt— Dilip Singh (@dileepsinghlive) October 2, 2023 #police #social-media #women #up మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి