కర్ణాటకలో అమానుష సంఘటన జరిగింది. కుమార్తె ప్రైవేటు వీడియోలను తీసిన సొంత తండ్రే సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉడుపికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (18 ఏళ్లు) దగ్గరి బంధువైన ఒక కుర్రాడిని ఇష్టపడింది. కానీ వీళ్ల ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి ఇష్టం లేదు. దీంతో కూతురును రోజూ వేధిస్తూ ఉండేవాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కొట్టేవాడు. ఒకరోజు ఆ యువకుడిని ఇంటికి పిలిపించి కొట్టాడు. అతడి ఫోన్లో ఉన్న కూతురి వ్యక్తిగత వీడియోలు బలవంతగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం
అవి వైరల్ కావడంతో ఆ యువతి అవమానం తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సకాలంలో బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. కుమార్తెను వేధిస్తున్నాడంటూ భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
Also Read: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా?