Stroke: విషాదం.. వడదెబ్బ తగిలి మహిళ మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకంది. పలిమెల మండల కేంద్రానికి చెందిన కుమ్మరి అనిత(45) అనే మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందింది. గత వారం రోజులుగా కూలీ పనులకు వెళ్తున్న ఆమె.. వడదెబ్బ తగలడంతో సోమవారం తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Woman Dies of Sun Stroke: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకంది. పలిమెల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి అనిత (45) గత వారం రోజులుగా కూలీ పనులకు వెళ్తోంది. దీంతో ఆమెకు వడదెబ్బ తగిలింది. సోమవారం తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలి అత్త చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తమాషారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వడదెబ్బ తగిలి అనిత మృతి చెందడంతో పలిమెల మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు