Andhra Pradesh: బైక్‌ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి

ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్‌ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో దారుణం జరిగింది. బైక్‌ చక్రంలో చీర ఇరుక్కోని రహదారిపై పడిపోవడంతో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందడం కలకలం రేపింది. ఆళ్లగడ్డ శివారులోని పడంకండ్ల ఎస్సీ గురుకులం వద్ద ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవెలకుంట్లలో నివాసం ఉంటున్న రాణిబాయి (22) అనే మహిళ.. భీమునిపాడు ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Also Read: సీఆర్‌తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ

ఆదివారం రోజు రాణిబాయి, ఆమె సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు రెండు బైక్‌లపై అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. దారిలో ఆమె చీర బైక్‌ వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయిన ఆమె.. చివరికి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషయం ఆమె కుటుంబీకులు, బంధుమిత్రులకు తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రమాబాయికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.

Also Read: ఘోర ప్రమాదం..పడవ మునిగి 90 మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు