/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MP-jpg.webp)
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ వివాదంలో ఇరుక్కున్నారు. అపర్నా ఠాకుర్ అనే మహిళ.. తాను రవి కిషన్ భార్యనని.. ఆయన నా కూతురుని సామాజికపరంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. లక్నోలో ఆమె.. తన కూతురు 'షెనోవా'తో కలిసి మీడియాతో మాట్లాడారు. 1996లో తనకు రవికిషన్‌తో పెళ్లి జరిగిందని ఆ తర్వాత తమకు కూతురు పుట్టినట్లు చెప్పారు. రవి కిషన్ తన కూతురుతో మాట్లాడుతున్నప్పటికీ.. బహిరంగంగా, సామాజికంగా షెనోవాను కూతురుగా అంగీకరించడం లేదని ఆరోపించారు. రవి కిషన్‌కు షెనోవా కూతురుగా ఉండే హక్కు ఉందని అన్నారు. అలాగే తన కూతురుతో కలిసి రవికిషన్ ఉన్నప్పటి ఫొటోలను కూడా చూపించారు. ఒకవేళ ఆయన.. తన కూతురుని అంగీకరించకపోతే.. కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
Also Read: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్
షెనోవా మాట్లాడుతూ.. ' నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు.. రవికిషన్ మా నాన్న అని తెలిసింది. అంతకుముందు ఆయన్ని నేను అంకుల్ అని పిలచేదాన్ని. నా పుట్టినరోజులు జరుపుకునేటప్పుడు ఆయన మా ఇంటికి వస్తుండేవారు. నేను ఆయన కుటుంబాన్ని కూడా కలిశాను. ఒక తండ్రిగా ఆయన నాకు అండగా ఉండలేదు. నన్ను కూతురుగా అంగీకరించాలని ఆయన్ని నేను కోరుతున్నాను. అందుకే మేము కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నామని' అన్నారు.
ఇదిలాఉండగా నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన రవి కిషన్.. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎక్కువగా భోజ్‌పూరి. హిందీ, అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించారు. రవి కిషన్ ప్రస్తుతం తన భార్య ప్రీతి కిషన్‌తో ఉంటున్నారు. వీళ్లకి ఓ కూతురు కూడా ఉంది.
Also Read: రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు.. ఇందిరా కాలం నుంచే మొదలయ్యాయా?
Aparna Thakur claims that BJP MP Ravi Kishan is father of her daughter Shenova. She along with her daughter held a press conference in Lucknow claiming that she would approach Court to get her daughter's legal rights if he doesn't accept Shenova as his daughter. They also want to… pic.twitter.com/bdvImCl0Bl
— Mohammed Zubair (@zoo_bear) April 15, 2024