Winter Health Care Tips: చలికాలంలో మొదలై చాలా కాలం అయినా.. ఇటీవలి కాలంలో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. స్వెట్టర్ వేసుకోకపోయినా.. బెడ్‌షీట్ కప్పుకోకపోయినా.. చలితో వణకాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, చలిని తట్టుకునేందుకు కొందరు రెండేసి బ్యాంక్లిట్స్ కప్పుకుంటారు. మరికొందరు తమ ఇళ్లలో రూమ్ హీటర్స్ పెట్టుకుంటారు. వీటి ద్వారా గదిలో కాస్త వేడి ఉత్పత్తి అవుతుంది. తద్వారా చలి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అయితే, రూమ్ హీటర్‌ను తక్కువగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే పెను ఉత్పాతాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా రాత్రంతా హీటర్‌ను రన్ చేయకూడదని, ప్రాణాపాయం అని అంటున్నారు. గత కొన్నేళ్లుగా రూం హీటర్ వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు. అందుకే రూమ్ హీటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..
శీతాకాలంలో రూమ్ హీటర్‌ను జాగ్రత్తగా వాడాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో రూమ్ హీటర్ జాగ్రత్తగా ఉపయోగించాలి. రూమ్ హీటర్‌ను తక్కువ సమయం మాత్రమే వినియోగించాలి. రాత్రిపూట హీటర్ ఆన్‌లో పెట్టి నిద్రపోవద్దు. రాత్రివేళ హీటర్ ఆన్‌లో ఉండటం వల్ల గదిలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ నిండిపోయి ఆక్సిజన్ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, నిద్రపోతున్నప్పుడు శ్వాస కూడా ఆగిపోతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. గది హీటర్ యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చు. ఆస్తమా మరియు శ్వాసకోశ రోగులు హీటర్‌ను వీలైనంత తక్కువగా నడపాలి.
రూమ్ హీటర్ ఆన్‌లో ఉంచడం వల్ల జరిగే నష్టాలు..
1. గదిలోని గాలిని పొడిగా చేయడానికి రూమ్ హీటర్ పనిచేస్తుంది. తద్వారా చర్మం పొడిగా మారుతుంది. ఇప్పటికే పొడి చర్మం ఉన్నవారు రూమ్ హీటర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి.
2. రూం హీటర్‌ను అతిగా వాడటం వల్ల కళ్లపై కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, చికాకు కలుగుతుంది. ఒకవేళ మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. హీటర్‌ను వెంటనే బంద్ చేయాలి.
3. కొందరికి రూమ్ హీటర్ వల్ల ఎలర్జీ వస్తుంది. ముక్కు నుంచి వచ్చే వేడి గాలి వల్ల కూడా ముక్కు పొడిబారుతుంది.
4. ఆస్తమా లేదా శ్వాసకోశ రోగులు ఎక్కువసేపు రూమ్ హీటర్ వినియోగించకూడదు. దీనివల్ల గదిలో ఆక్సిజన్ స్థాయి తగ్గవచ్చు. ఇది శ్వాస సమస్యలను కలిగిస్తుంది.
5. రూమ్ హీటర్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే ఎక్కువ సేపు రూమ్ హీటర్ వాడకానికి దూరంగా ఉండాలి.
Also Read:
Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..
ISRO: ‘ఆదిత్య ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్ మీడియాలో ఇస్రో ఫోటో..