Telangana : మందుబాబులకు షాక్.. కౌంటింగ్ రోజున వైన్ షాపులు బంద్ జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ రోజున మద్యం షాపులు మూసివేయబడతాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 01 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Wine Shops Will Be Shut Down : జూన్ 4న ఓట్ల లెక్కింపు (Counting Votes) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు (Counting Day) న మద్యం షాపులు (Liquor Shops) మూసివేయబడతాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Vikas Raj) వెల్లడించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Also Read: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట.! 34 కేంద్రాల్లో కౌంటింగ్ జరగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామని తెలిపారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. 10 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. Also Read: భారీగా తగ్గిన ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు! #telugu-news #telangana-news #vikas-raj #vote-counting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి