Andhra Pradesh: అధికార, విపక్ష పార్టీకి సవాలుగా మారనున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఆగస్టు 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. గెలువరిదనేదానిపై ఆసక్తి నెలకొంది. By B Aravind 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి AP MLC: ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి తొలిసారిగా సవాల్ ఎదురుకానుంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 30న ఈ ఎన్నికల జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు పార్టీ కూడా మారిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ తన సీటు నిలబెట్టుకోగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ హయాంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్.. ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ తర్వాత విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల అనివార్యమైంది. అయితే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో ప్రతిపక్ష వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. కానీ అధికార పార్టీ టీడీపీకి మాత్రం కేవలం 215 మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే వైసీపీకే ఆధిక్యం ఉంది. అయితే ఇప్పుడు అధికారం మారడంతో గెలపు ఎవరివైపు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. దీంతో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఎమ్మెల్సీ స్థానాన్ని సాధించింది. Also Read: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..! మరోవైపు విశాఖలో కొంతమంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామ చేసి టీడీపీ, జనసేన పార్టీలలో చేరారు. అలాగే పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు సైతం టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే వీళ్లంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఓటేసే అవకాశాలున్నాయి. దీంతో వైసీపీ మెజార్టీకి కాస్త దెబ్బపడినట్లైంది. అయినప్పటికీ కూడా వైసీపీ మోజార్టీని కోల్పోయేంత సంఖ్యలో టీడీపీలోకి వలసలు లేవని.. దీంతో వైసీపీయే ఎమ్మెల్సీ స్థానం గెలుచుకొనే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఒకవేళ వలసలకు ఆహ్వానిస్తే.. ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందుకే ఈ ఎన్నిక అధికార, విపక్ష పార్టీలకు సవాలుగా మారింది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ.. సీనియర్ నేత బోత్స సత్యనారాయణను ఎన్నికల బరిలోకి దింపుతోంది. ఈయనకు స్థానికంగా ప్రజల్లో పాపులారిటీ ఉండటంతో గెలుపు గుర్రంగా భావిస్తోంది వైసీపీ. మరి వైసీపీ వ్యూహాం ఫలిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలాఉండగా.. ఆగస్టు 30న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికకు ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 14 నామినేషన్ల పరిశీలన, 30న ఎన్నిక జరగనుంది. ఎన్నికల తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఎవరివైపు ఉంటుందనే దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. Also Read: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.! #telugu-news #chandrababu-naidu #ys-jagan #vizag #mlc-elections #vizag-mlc-election మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి