Fee Reimbursement : నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనాలు చెల్లించేనా..?

తెలంగాణలో దాదాపు రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక.. పేద విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. కొత్త ప్రభుత్వం వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Fee Reimbursement : నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనాలు చెల్లించేనా..?
New Update

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మొదలైన తెలంగాణ కోసం దాదాపు 1200 వందల మంది ప్రాణత్యాగాలు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు విద్యార్థులను, విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య హామీలు ప్రభుత్వం ఇచ్చినా.. అమలకు మాత్రం నోచుకోలేదు. తెలంగాణ విద్య వ్యవస్థ, నిధులు, నియామకాలు గత ప్రభుత్వంలో ఛిన్నాభిన్నం అయ్యాయి. దాదాపుగా 5,300 కోట్ల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ విడుదల కాక.. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో.. ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం విద్య బకాయిలతో కూరుకుపోయింది.

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు

ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్‌డీ వరకు గత ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో.. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో చాలా వరకు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.

రూ.5300 కోట్ల నిధులు రావాలి

2020-2021 విద్యా సంవత్సరానికి గాను దాదాపు 3,350 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. 2022-2023 విద్యా సంవత్సరానికి 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కావాల్సి ఉంది. కాబట్టి బకాయిలు చెల్లించాలని నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏడాది దాదాపు 6.20 లక్షల మంది కొత్తగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దాదాపు 8 -10 లక్షల మంది రెన్యువల్ చేసుకుంటున్నారు.

కొత్త ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి

ప్రభుత్వం సంవత్సరానికి రూ.3,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, గత ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి పైసా కూడా విడుదల చేయలేదు. గత రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు.. విద్యార్థులను సొంతంగా ఫీజు చెల్లించమని బలవంతం చేస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించిన తర్వాత విద్యార్థులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తామని హామీ ఇస్తున్నాయి. దీంతో ఫీజు చెల్లించలేకపోతున్న పేద విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారు. ఈ నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనం నిధులు విడుదల చేయాలని విద్యార్థుల తరుఫున ఎబీవీపీ కోరుతుంది.

publive-image

సిలివేరు అశోక్
ABVP ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు
స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్

#telugu-news #telangana-news #fee-reimbursement
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe