చైనా తైవాన్‌ను 24 గంటల్లో చుట్టుముట్టింది.అనంతరం తన సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, రాకెట్ బలగాలను మోహరించి విన్యాసాలకు పాల్పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చైనా చేస్తున్న ఈ సైనిక విన్యాసం తైవాన్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. , ఉత్తర, దక్షిణ తైవాన్, తూర్పు తైవాన్‌లను చైనా అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. చైనా తన సైనిక దళానికి పనిష్‌మెంట్ డ్రిల్ అని పేరు పెట్టింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మూడు రోజుల క్రితమే తైవాన్ కొత్త అధ్యక్షుడు, చైనాకు బద్ధ ప్రత్యర్థిగా భావించే విలియం లై చింగ్-తే తైవాన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే యుద్ధ కసరత్తుల ద్వారా తైవాన్ కొత్త అధ్యక్షుడు విలియం లాయ్ చింగ్ టెను చైనా బెదిరించింది. తైవాన్ ప్రాంతాలను చైనా ఎప్పుడైనా ఆక్రమించుకోవచ్చు. చైనా ఈ చర్యపై తైవాన్ కొత్త అధ్యక్షుడు విలియం లై చింగ్-తే తీవ్రంగా స్పందించారు.
తైవాన్ అధ్యక్షుడు ఏం చెప్పారు?
దేశ రక్షణ, భద్రత కోసం నా సైన్యంలో పాటు మొదటి వరుసలో తాను నిలుస్తానని తైవాన్ అధ్యక్షుడు విలియం లై అన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తైవాన్‌పై చాలా శ్రద్ధ చూపుతోంది. బాహ్య సవాళ్లు, బెదిరింపుల నేపథ్యంలో, మేము ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం , ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడడం కొనసాగిస్తాము.
ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఆఫ్ చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ఉదయం 7.45 గంటలకు తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులు ప్రారంభించినట్లు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న తైవాన్-నియంత్రిత ద్వీపాలైన కిన్‌మెన్, మాట్సు, వుకియు ,డాంగ్యిన్‌లను కూడా చైనా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. తైవాన్‌ను ముట్టడించేందుకు, చైనా తన అత్యంత అధునాతన యుద్ధ విమానం J-20 మరియు J-16, టైప్ 052D గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, DF క్షిపణి , దీర్ఘ-శ్రేణి రాకెట్ లాంచర్‌లను సముద్రంలోకి ప్రవేశపెట్టింది. తైవాన్ స్వాతంత్రం కోరుకునే వారికి ఈ సైనిక విన్యాసాన్ని శిక్షగా చైనా ఆర్మీ అభివర్ణించింది.
ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రతినిధి లి జి మాట్లాడుతూ, మా ఆపరేషన్ కోడ్ పేరు జాయింట్ స్వోర్డ్-2024A అని పేరు పెట్టాము.తైవాన్ ద్వీపం చుట్టుపక్కల ప్రాంతంలో చైనా తూర్పు థియేటర్ కమాండ్ శిక్షణను నిర్వహిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డ్రిల్ ఈ ప్రాంతంలో జాతీయ భద్రత, సార్వభౌమాధికారం , ప్రాదేశిక సమగ్రతను కాపాడటం, అలాగే తైవాన్‌లో స్వాతంత్ర్యం కోరుతున్న వేర్పాటువాద శక్తులను కఠినంగా శిక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.