Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 11 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Will Take Back PoK - Amit Shah: తెలంగాణలో పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్)ను తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కే విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల సభలో అమిత్ షా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, అందుకే పాకిస్థాన్ తో జాగ్రత్తగా వ్యవహరించాలని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ALSO READ: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష సీఎంలు అరెస్ట్ అవుతారు.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పోఖ్రాన్ పరీక్ష నిర్వహించి భారత్‌ను అణుశక్తిగా మార్చారని అమిత్ షా గుర్తు చేశారు. పాక్ భూభాగంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్ ‘కాకిని కూడా చంపలేదని’ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతమైన నిర్ణయం వల్ల పాకిస్థాన్‌లో ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసి వారిని అంతమందిచారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కోట్లాది రూపాయలు పంపారు, మీ గ్రామాలకు ఏమైనా అందాయా? అని ప్రశ్నించారు. #WATCH | While addressing a public meeting in Telangana's Nagarkurnool, Union Home Minister Amit Shah says, "Revanth Reddy has made Telangana an ATM for Congress party. PM Modi has sent crores of rupees for the development of Telangana, have your villages received anything?..." pic.twitter.com/DR4LqFcZVb — ANI (@ANI) May 11, 2024 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 10కి పైగా సీట్లు ఇప్పించండి, ముస్లింలకు ఈ 4% రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తాం అని అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వంటి వారు అణ్వాయుధ శక్తి ఉన్నందున పాకిస్థాన్‌కు గౌరవం చూపాలని మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అన్నారు. “కాశ్మీర్ మనకు చెందదా? మేము నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాము, పీఓకేని తీసుకుంటాము, ”అని అమిత్ షా అన్నారు. #WATCH | While addressing a public meeting in Telangana's Nagarkurnool, Union Home Minister Amit Shah says, "...In Telangana Congress party has given 4% reservation to Muslims, which is unconstitutional. Give us more than 10 seats in the state and we will end this 4% reservation… pic.twitter.com/uVS0Q8zU9U — ANI (@ANI) May 11, 2024 #cm-revanth-reddy #lok-sabha-elections-2024 #amit-shah #pok మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి