Ponguleti Srinivas Reddy: ఐటీ దిగ్బంధంలో పొంగులేటి.. నామినేషన్ వేస్తారా.. లేదా..?

కాంగ్రెస్ నేత పొంగులేటి నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజే పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఐటీ దిగ్బంధంలో ఉన్న పొంగులేటిని నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Ponguleti Srinivas Reddy: ఐటీ దిగ్బంధంలో పొంగులేటి.. నామినేషన్ వేస్తారా.. లేదా..?

నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు. ఇక నవంబర్‌ 10తో అభ్యర్థులు నామినేషన్లు వేయడం పూర్తవుతుంది. అయితే ఈరోజే కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధం అయిపోయారు. కానీ ఉదయం 4 గంటలకు ఊహించని షాక్. ఒక్కసారిగా ఐటీ అధికారులు ఆయన నివాసంలోకి దూసుకొచ్చారు. ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ తనిఖీలు మొదలుపెట్టేశారు. అయితే ఈరోజు నామినేషన్ వేయాల్సిన ఉన్న పొంగులేటి సంగతేంటి. ఆయన్ను నామినేషన్‌కు అనుమతి ఇస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు ఐటీ అధికారుల తీరుపై పొంగులేటి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, ఈటల

పొంగులేటి కొంతకాలం క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే బుధవారమే పొంగులేటి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని.. తన ఇంటిపై కూడా దాడులు జరగవచ్చని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక పొంగులేటి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులపై.. ఆయన అనుచరుడు మువ్వా విజయ్ బాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈరోజు నామినేషన్ వేస్తున్న సమయంలో దాడులు చేయడం వెనక కుట్ర ఉందంటూ మండిపడ్డారు. పొంగులేటి నామినేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నామినేషన్ ఆగదంటూ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు