Tomatoes: టమాటాలు ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే

టమాటాలను ఒకటి రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వచేయడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వచేస్తే వాటి సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని.. అలాగే వాటి లోపల జెల్లీ విరిగిపోయి జూసీలా తయారవుతుందని వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.

Tomatoes: టమాటాలు ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే
New Update

టమాటాలు లేకుండా ఏ కూరను వండుకోలేము. ఏ కూరగాయలతో కూరలు వండిన వాటిలో కచ్చితంగా టమాటాలు వేయాల్సిందే. ప్రతిరోజు మనం తినే ఆహారంలో టమాటా అనేది ఉంటుంది. చాలామంది టమాటాలను వారి కిచెన్‌లో ఎప్పుడు పెట్టుకుంటారు. మరికొంతమంది ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేస్తారు. అలా ఫ్రిజ్‌లో టమాటాలు పెట్టడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో టమాటాలు నిల్వచేస్తే అది విషంతో సమానమంటూ అంటున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఏం తేలిందంటే.. టమాటాలను రిఫ్రిజిరేటర్‌లో పెడితే వాటికి ఉండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయి. 39 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద టమాటాలు ఉంచినప్పుడు రుచి, వాసన ఎలా పోతుందనేది కూడా పరిశోధనల్లో వెల్లడైంది.

Also Read: ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

ఒకటి రెండు రోజులు నిల్వచేస్తే ఏం కాదు. కానీ అంతకంటే ఎక్కువ రోజులు పెట్టడం మంచిది కాదు. వీటివల్ల డీఎన్‌ఏ మిథైల్‌ సంశ్లేషణలో మార్పులు అనేవి సంభవిస్తాయి. వాస్తవానికి ఒక జీవి డీఎన్‌ఏకు అనుగూణంగా దాని పనితీరు మార్చే విధానాన్నే మిథైలేషన్ అని అంటారు. జన్యు వ్యక్తీకరణను అదుపుచేసే విషయంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఇది సక్రమంగా లేనప్పుడు అసాధారణ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం టమాటాలను రిఫ్రిజిరెటర్‌లో రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు పెడితే ఈ మిథైలేషన్‌లో మార్పులు వచ్చి రోగాల బారీన పడే ప్రమాదముంది. అంతేకాదు ఎక్కువరోజులు పెట్టినట్లైతే టమాటా లోపల ఉండే జెల్లీ అనేది విరిగిపోయి.. అంతా జ్యూసీలాగా మారుతుంది. ఇలాంటి టమాటాలను ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు.

Also Read: టోపీ పెట్టుకుంటే బట్టతల ఖాయమా?..ఏది నిజం?

వాస్తవానికి టమాటాలను వండేటప్పుడు అవి ఇథలీన్‌ను విడుదల చేస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో చల్లగా ఉండటం వల్ల ఇథలీన్ ఉత్పత్తి ఆగుతుంది. దీంతో టమాటాలు వాటికి ఉండే సహజమైన రుచిని కోల్పోతాయి. చివరికి పుల్లగా మారిపోతుంది. అందుకే టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేస్తే మంచిదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. రూమ్ టెంపరేచర్‌ వద్ద ఉంచితేనే.. అవి వాటి సహజ సిద్ధమైన లక్షణాన్ని కోల్పోకుండా తాజాగా ఉంటాయి. అలాగే ఆ టమాటాలను కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేం. అందుకే టామాటాలు కొనేటప్పుడు బాగా పండిన వాటిని తీసుకోవద్దు. కొన్ని దోరగా.. మరికొన్ని కాయల్లా ఉన్నవి తీసుకోవాలి. దీంతో టమాటాలను పూర్తిగా వాడుకోవచ్చు. మరో విషయం ఏంటంటే టమాటాలను స్టోర్ చేసేటప్పుడు వాటికి ఉన్నటువంటి కాండం తీసేయాలి. ఎందుకంటే కాండం ఉంటే టమాటాలు తొందరగా పండి ఆ తర్వాత కుళ్లిపోయే అవకాశాలున్నాయి. అలాగే టమాటాలను నిల్వచేసేటప్పుడు కూడా సూర్యరశ్మీ తగలకుండా జాగ్రత్తపరచాలి. ముఖ్యంగా పాలిథీన్‌ కవ్‌లో నిల్వచేస్తే.. ఎక్కువ రోజుల పాటు టమాటాలు తాజాగా ఉంటాయి.

#telugu-news #tomatoes #health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe