ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పెద్దలు కుదిర్చిన సంబంధాలతో మాత్రమే పెళ్లిళ్లు జరిగేవి. కాలం మారేకొద్ది క్రమంగా ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం అరెంజ్‌డ్ మ్యారెజ్, లవ్ మ్యారెజ్ ఈ రెండు రకాల వివాహాలు జరుగుతున్నాయి. అయితే చాలామంది పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ పెళ్లి చేసుకుంటేనే దంపతులు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ ఈ మధ్య లవ్ మ్యారెజ్‌లు చేసుకున్న వాళ్లలో కూడా కొన్ని జంటలు విడిపోతున్నాయి. అయితే ఇందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్చులు, బాధ్యతలు
వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అలాగే కుటంబ పెద్దలు, పిల్లల్ని చూసుకోవడం.. వాళ్ల ఖర్చులని భరించడం లాంటి బాధ్యతలు దంపతులకు కొంత భారంగా మారుతాయి. ఈ విషయాల పట్ల భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరి మధ్య బేధాప్రాయాలు రావడం, అన్ని విషయాల్లో సర్థుకోక పోవడం వల్ల చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద గొడవలకు కూడా దారి తీస్తాయి. దీనివల్ల కూడా విడాకులు తీసుకుంటున్నారు.
అలవాట్లు, ఆచారాలతో సమస్యలు
వాస్తవానికి ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్వేచ్ఛ పెళ్లి అయ్యాక కూడా ఉంటుందని అనుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ఈ విషయంలో తేడాలు కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు ఇలా ఉండకపోవడంతో విడిపోయేందుకు ఆలోచిస్తారు. అలాగే ఆహారం, అలవాట్ల విషయంలో కూడా తేడాలు రావడంతో చాలావరకు సంబంధాలు విడిపోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇద్దరు కూడా వేర్వేరు సంస్కృతిలో, ఆచారాల నుంచి వచ్చినవారు పెళ్లి చేసుకున్నా కూడా ఆచార వ్యవహారాలు పాటించడం సరిగా తెలియక ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతున్నాయి. ఈ సమస్యల వల్ల కూడా దంపతులు విడిపోయే వరకు దారితీస్తున్నాయి.
ప్రవర్తనలో మార్పులు
అయితే ప్రేమలో ఉన్నప్పుడు మగవారు మాత్రమే తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ.. పెళ్లయ్యాక బాధ్యతలు పెరగడం, ఒత్తిడి, ఆందోళనల వల్ల వారిలో కొన్ని గుణాలు బయటపడతాయి. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగి విడాకులకు దారితీస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయికి అమ్మాయి ప్రవర్తన ఏంటో తెలుస్తుంది. కానీ అతడి అత్త, మామలు ఎలా ఉంటారో తెలియదు. వారి ప్రవర్తనల వల్ల కూడా ఏదైన ఇబ్బందులు తలెత్తితే.. దంపతుల మధ్య గొడవలు జరిగి విడిపోయే వరకు దారి తీస్తాయి.