IT RAIDS:హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి?

రెండు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఐటీ రైడ్‌లు కలకలం సృష్టించాయి. చిట్ ఫండ్ కంపెనీలు, ప్రైవేటు ఏజెన్సీలే టార్గెట్గా రైడ్స్ జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ఇంటితో మొదలుపెట్టి రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రైడ్ జరిగిన అన్ని ప్రదేశాలు మాగంటి బంధువులు, స్నేమితులకు సంబంధించినవే అని సమాచారం.

New Update
IT RAIDS:హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి?

హైదరాబాద్‌లో ఐటీ అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారు 5 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మొట్టమొదటగా సోదాలు నిర్వహించారు. తర్వాత ఆయన సోదరుడి నివాసం, మరికొంత మంది వ్యాపారస్తు నివాసాల్లో కూడా సోదాలు చేశారు. అలాగే పలు చిట్ ఫండ్స్ కంపెనీలు,ప్రైవేటు ఏజెన్సీల్లో కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా పూజా కష్ణ చిట్ ఫండ్స్ మీద ఇంకా అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేపీహెచ్బీ, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

publive-image మాగంటి కుటుంబం ITR వివరాలు

సోదాలు జరుగుతున్న అన్ని ఐటీ కంపెనీలు, ప్రైవేటు ఏజెన్సీలు టాక్స్ కట్టడంలో అవకతవకలకు పాల్పడ్డాయని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు సోదా చేస్తున్న ఇళ్ళు, చిట్ ఫండ్ కంపెనీలతో పాటూ ఇతర ప్రవైటు సంస్థలు అన్నీ మాగంటి గోపీనాథ్ బంధువులు, స్నేహితులకు సంబంధించినవే అని సమాచారం.

మాగంటి గోపీనాథ్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట టీడీపీలో ఉన్న ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014లో టీడీపీ తరుఫున హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ లోకి మారిన మాగంటి 2018లో ఆ పార్టీ నుంచే పోటీ చేసి గెలిచారు. 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయనకు రాజకీయాలతో పాటూ చాలా వ్యాపారాల్లో భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది.

మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమెల్యే. ఈయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ప్రకారం మాగంటి ఆస్తుల విలువ 11 కోట్ల 72 లక్షలు రూపాయలు. ఇది ఆయన 2018 ఎన్నికలప్పుడు మెన్షన్ చేసిన అఫడివిట్ ప్రకారం. అంతకు ముందు 2014లో మాగంటి ఆస్తుల విలువ 6 కోట్ల 25 లక్షల రూపాయలు. అఫడివిట్ ప్రకారం 5ఏళ్ళల్లో 5 కోట్లు ఆయన సంపాదన పెరిగింది. అయితే అందులో చూపించిన లెక్కలే కాకుండా ఇంకా చాలా ఆస్తులు మాగంటి గోపీనాథ్ కు ఉన్నాయని తెలుస్తోంది. మాగంటి సోదరుడు, ఆయన బంధువులు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది బాగస్వామ్యంతో మాగంటి పలు వ్యాపారాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారాల ట్యాక్స్ లెక్కల్లోనే తేడాలు రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం.

Also Read:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు

Advertisment
Advertisment
తాజా కథనాలు