Eyelids Tips: కనురెప్పల వాపు ఎందుకు వాస్తాయి?.. నివారణ మార్గాలు ఇవే

ఈరోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు కంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కనురెప్పల వాపు అనేది చాలా సాధారణ పరిస్థితి. కానీ కొన్నిసార్లు దానిని విస్మరించడం ప్రమాదానికి దారితీస్తుంది. కంటి ఇన్ఫెక్షన్ విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

New Update
Summer Tips  : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..!

Eyelids Tips: కళ్లు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. కంటి సమస్యలు ఒకసారి వస్తే జీవితాంతం ఉంటాయి. ఈరోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు కంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కనురెప్పల వాపు అనేది సాధారణ సమస్యగా మారుతోంది. కనురెప్పల వాపు అనేది చాలా సాధారణ పరిస్థితి. కానీ కొన్నిసార్లు దానిని విస్మరించడం ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

publive-image

కనురెప్పల వాపునకు కారణాలు:

తైల గ్రంధుల పనిచేయకపోవడం, కనురెప్పల ఇన్ఫెక్షన్ ఏదైనా రకం, వాయు కాలుష్యం, అలెర్జీలు, నిరంతరం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లను చూడటం ముఖ్య కారణాలని నిపుణులు అంటున్నారు.

Why do eyelids swell These are the remedies

కనురెప్పల వాపునకు చికిత్స:

కనురెప్పల వాపు చికిత్స వ్యాధి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కంటి ఇన్ఫెక్షన్ విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి యాంటీబయాటిక్ కంటి చుక్కలు వాడాలి. కనురెప్పల వాపు నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో కావొచ్చు.

publive-image

కళ్లను తరచూ కడగాలి:

కనురెప్పల వాపు సమస్య రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 సార్లు చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కనురెప్పలు తేమగా ఉండి వాపు పోతుందని చెబుతున్నారు.

వేడి క్లాత్‌ ఉంచాలి:

కనురెప్పల వాపును తగ్గించడానికి ఒక పాత్రలో వేడి నీటిని మరిగించండి. ఈ వేడి నీళ్లలో కాటన్ క్లాత్‌ని ముంచి నీటిని పిండేసి కనురెప్పల మీద కాసేపు ఉంచాలి. ఇలా రెండుమూడుసార్లు చేస్తే దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.

publive-image

ఇయర్‌ డ్రాప్స్‌:

తేమ కోల్పోవడం వల్ల కనురెప్పల మీద వాపు సమస్య వస్తుంది. చాలా సార్లు కాలుష్యం కారణంగా కళ్లు తేమను కోల్పోతాయి. ఈ పరిస్థితిలో కంటి డ్రాప్స్‌ వేసుకోవాలి. కాకపోతే డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: PCOSను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది?..లక్షణాలేంటి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు