రాజస్థాన్‌ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు!

రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి ఎవరు అర్హులు అనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న వసుంధర రాజేకి కాకుండా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కమలనాథులు యోచిస్తున్నారు.

New Update
రాజస్థాన్‌ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు!

Rajasthan CM : గత నెల చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కమలం జెండా పాతిన విషయం తెలిసిందే. ఓడిన రాష్ట్రాల గురించి తీసివేస్తే..ఇప్పుడు గెలిచిన రాష్ట్రాల గురించే బీజేపీ కి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎందుకంటే మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో కమలనాథులు తర్జనాభర్జనా పడుతున్నారు.

ఇందులో కూడా ముఖ్యంగా రాజస్థాన్‌(Rajasthan) సీఎం పీఠం ఎవరికి ఇవ్వాలనే దాని మీద అసలు చర్చ అంతా నడుస్తుంది. ఈసారి రేసులో చాలా మంది నేతలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. వీరందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే గట్టి పోటీనే ఇస్తున్నారు. ఆమెను వద్దు అనలేక బీజేపీ పెద్దలకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎన్నికల సమయంలో కూడా బీజేపీ పెద్దలు సీఎం ఎవరు అనేది తేల్చి చెప్పలేదు.

దీంతో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కానీ బీజేపీ వారు ఆ పని చేయలేదు. దీంతో ముఖ్య నేతలు అందరూ కూడా సీఎం రేసులో ఉన్నారు. వారిలో ముఖ్యంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఓం మాథూర్‌, దియా కుమారి, కిరోరి లాల్ మీనా , బాబా బాలక్‌ నాథ్‌ ఉన్నారు.

వీరిలో బీజేపీ(BJP) పెద్దలు బాలక్‌ నాథ్‌ను పీఠం ఎక్కించాలని చూస్తుండగా..అనుకొని పరిస్థితుల్లో తెర మీదకు మరో పేరు కూడా వచ్చి చేరింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ పేరే ఇప్పుడు తెరమీదకు వచ్చి అందర్ని కలవర పెడుతుంది. ఈ క్రమంలో వసుంధర రాజే తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారా లేక బీజేపీ పెద్దల నిర్ణయానికే ఆమె తలవంచుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఈ క్రమంలోనే మంగళవారం నాడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నట్లు ఇప్పటికే పలువురు పెద్దలు అంటున్నారు. ఈసారి సీఎం రేసులో అరడజను మంది పేర్లు ఉండటంతో కొంచెం కష్టం అవుతుంది. అయితే వీరిలో ఇప్పటికే కొందర్ని కమలనాథులు పక్కకి తోసినట్లు గుసగుసలు కూడా వినబడుతున్నాయి. వీరిలో మహంత్‌ బాలక్‌ నాథ్‌, కిరోరి లాల్ మీనా రేసు నుంచి పక్కకి జరిగారు.

ఈసారి బీజేపీ వారు దళిత వ్యక్తికి లేదా ఓబీసీ లకు ఛాన్స్‌ ఇచ్చేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ పేరు కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓం మాథుర్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా పార్టీకి విజయాన్ని పట్టుకొచ్చేశారు.

అందుకే ఆయనకు రాజస్థాన్ పీఠాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనకే పీఠాన్ని ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బాలక్‌ నాథ్‌ చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్‌ అవుతుంది. దీంతో ఆయన తప్పుకున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఢిల్లీలో కిరోరి లాల్ కు పట్టు పెద్దగా లేకపోవడంతో ఆయనకు కూడా పెద్దగా ఛాన్స్‌ లేదు. రాజకీయాల్లో 40 ఏళ్ల నుంచి కొనసాగుతున్నప్పటికీ ఆయనకు చెప్పుకోదగ్గ పదవులు ఏమి దక్కలేదు. దాంతో ఆయనకు సీఎం అయ్యే ఛాన్స్‌ లేదు. ఈ క్రమంలో గజేంద్ర షెకావత్‌ కి బీజేపీ పెద్దగా అవకాశాలు ఇచ్చే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే ఆయన గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఆయనను ఈసారి సీఎం పీఠం ఎక్కించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు టాక్‌ గట్టిగా వినిపిస్తుంది. కానీ వసుంధర మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటూ పోటీకి సై అంటున్నారు. మరీ ఈసారి రాజస్థాన్‌ పీఠం ఎవరికీ దక్కుతుందో చూడాల్సిందే.

Also read: బాలీవుడ్ సీనియర్ హీరోలకు కోర్టు నోటీసులు..ఎందుకంటే!

Advertisment
తాజా కథనాలు