Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా?

పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

New Update
Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా?

Puvvada Ajay Kumar: ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు..

పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం (Khammam) ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోసారి గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) టికెట్ ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఊవిళ్లురుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈసారి ఎలాగైనా పువ్వాడను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి.

పువ్వాడను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అయితే పువ్వాడను ఓడించి తీరుతామంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇందుకోసం ధీటైన అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. పొంగులేటి ప్రధాన అనుచరుడు మువ్వా విజయ్ బాబు.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అనుచరులు మహ్మద్ జావిద్, పువ్వాళ్ల దుర్గా ప్రసాద్.. రేణుకాచౌదరి అనుచరుడు మానుకొండ రాధాకిషోర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరెవరూ పువ్వాడకు సమఉజ్జీలుగా నిలవలేరు. మరోవైపు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

బరిలో ఎవరున్నా గెలుపు తనదే..

ప్రతిపక్ష నేతలు మంత్రి పువ్వాడ అజయ్‌ను ఓడగొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. అయితే పువ్వాడ మాత్రం మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. విపక్ష నాయకుల సవాళ్లకు బెదరొద్దంటూ క్యాడర్‌కు సూచిస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ఖమ్మం బరిలో ఎవరున్నా గెలుపు తనదేనంటూ పువ్వాడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా సరే తనదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందని..  ఇతర పార్టీలు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని పువ్వాడ వెల్లడించారు.

ఇతర పార్టీల్లో బలమైన నేతలు..

అయితే జిల్లాలో బలమైన నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), రేణుకాచౌదరి, మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhatti Vikramarka) లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరోవైపు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ 6 స్థానాలు, టీడీపీ 2 స్థానాలు గెలవగా.. గులాబీ పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. అలాంటిది ఈసారి ముఖ్య నేతలందరూ పార్టీ మారి ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Also Read: హుస్నాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌దే

Advertisment
తాజా కథనాలు