Indian Premier League : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup) నిర్వహించాల్సి ఉంది. భారత జట్టు(India Team) లో చోటు దక్కించుకోవడానికి ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఐపీఎల్(IPL) లో తమ సత్తా చూపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఎవరి పేరును చేరుస్తారో ఏ ఆటగాడి పై భారత సెలక్టర్ల మొగ్గు ఉందో మరి కొద్ది రోజులలో తేలనుంది. క్రికెట్ లో వికెట్ కీపర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అటువంటి సమయంలో రానున్న వరల్డ్ కప్ లో టీమిండియాకు జట్టు వికెట్ కీపర్ ఎవరనేది పెద్ద ప్రశ్న. ఘోర కారు ప్రమాదం తర్వాత పునరాగమనం చేస్తున్న రిషబ్ పంత్ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదం(Car Accident) తర్వాత ఆడుతున్నట్లు అస్సలు కనిపించడం లేదు. ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమించిన ఈ స్టార్.. ఢిల్లీ తరఫున ఇప్పటివరకు అద్భుతమైన వికెట్ కీపింగ్ చేశాడు. అతని ఖాతాలో రెండు వేగవంతమైన అర్ధశతకాలు నమోదయ్యాయి. ఇందులో కోల్‌కతాపై ఒకే ఓవర్‌లో 28 పరుగులతో బ్యాటింగ్ చేయడం అందరికీ పాత పంత్‌ని గుర్తు చేసింది. ప్రపంచ కప్ జట్టు ఎంపిక లో ఇప్పుడు అతని పేరు ఉంటుందా అనే సందేహాలకు మరికొద్ది రోజులలో చెక్ పడనుంది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లతో పాటు ధృవ్ జురెల్ కూడా వికెట్ కీపర్ల జాబితాలో రేస్ లో ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 మధ్య నిర్వహించాల్సి ఉంది. టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్లకు జట్టు పేర్లను పంపడానికి ICC మే 15 చివరి తేదీగా నిర్ణయించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో టీమిండియా జట్టు ఎంపిక కోసం సమావేశం కానుంది.