/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WHO-tips-to-reduce-obesity-jpg.webp)
Obesity: ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. 1990 నుంచి ఈ సంఖ్య రెండింతలు పెరిగింది. అయితే 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో ఇది నాలుగు రెట్లు పెరిగింది. పసిఫిక్ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దేశాల్లో ఊబకాయం ఎక్కువ:
- ఊబకాయం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. స్థూలకాయాన్ని సకాలంలో నియంత్రించుకోకపోతే శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఊబకాయానికి సంబంధించి ఆశ్చర్యకరమైన నివేదిక ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ఊబకాయం ఉన్న దేశాలలో 9 పసిఫిక్ ప్రాంతానికి చెందినవే ఉన్నాయి. వీటిలో ఫిజి, సమోవా, సోలమన్, పాపువా న్యూ గినియా, మైక్రోనేషియా వంటి దీవులు ఉన్నాయి. ఈ దేశాలలో 20 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుంది.
నివేదికలో ఏముంది..?
- 2022 డేటా ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంలో బాధపడుతున్నారని తేలింది. 2022లో 43శాతం మంది పెద్దలు అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. WHO సహాయంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఊబకాయంతో ఆకస్మిక మరణం లేదా వైకల్యం కూడా పెరిగింది. ఊబకాయం మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.
ఊబకాయం తగ్గించుకోవడానికి WHO ఏం చెప్పింది..?
1. పసిఫిక్ దేశాల ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మతపెద్దలంతా ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
2. అనారోగ్యకరమైన ఆహారం, పానీయాల రేట్లు పెంచాలి, దీని వల్ల ప్రజలు వాటివైపు మొగ్గుచూపరన్న WHO.
3. ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తక్కువ ధరకు అందించాలి.
4. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి.
5. బాల్యం నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి. పిల్లల ఎత్తు, బరువుపై శ్రద్ధపెట్టాలి.
6. రోజులో వ్యాయామం చేయడానికి కొంత సమయం ఇవ్వాలని సూచించిన WHO.
ఇది కూడా చదవండి: ఏ విటమిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది?.. లోపాన్ని ఎలా అధిగమించాలి..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.