Corona: ఈ కరోనా కజిన్‌తో ముప్పు తప్పదా? కొత్త వేరియంట్‌తో కసికసిగా కొవిడ్ కాటు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 30 రోజుల్లో కొవిడ్ కేసులు 80శాతం పెరిగినట్టు WHO ప్రకటించింది. ఈ వ్యవధిలో మొత్తం 15లక్షల కరోనా కేసులు రికార్డవగా.. అందులో 12లక్షల కేసులు దక్షిణకొరియాలోనే నమోదయ్యాయి. అటు కొత్త వేరియంట్‌ EG.5తో బ్రిటన్, అమెరికాలో కేసులు పెరుగుతుండగా.. ప్రస్తుతానికైతే ఇండియాకు ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Corona: ఈ కరోనా కజిన్‌తో ముప్పు తప్పదా? కొత్త వేరియంట్‌తో కసికసిగా కొవిడ్ కాటు!
New Update

The jump in corona virus cases is mostly fueled by reported infections from South Korea: కరోనా ముప్పు పోయిందని రిలాక్స్ అవుతున్నారా? మాస్కులు తీసి పడేసి తిరుగుతున్నారా? గ్రూపులుగా పార్టీలు చేసుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే.. ఈ ఒక్క నెలలోనే (30 రోజులు) ప్రపంచవ్యాప్తంగా 80శాతం కేసులు పెరిగాయట..! ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని WHO బాంబు పేల్చింది. దక్షిణకొరియాలో మొదలైన కరోనా వ్యాప్తి క్రమక్రమంగా ఇతర దేశాలకు కూడా పెరుగుతుందని చెప్పింది. ఈ నెల రోజుల్లో మొత్తం 103దేశాల్లో కనీసం ఒక్క కరోనా కేసు నమోదైనట్టు WHO తెలిపింది. ఇది ప్రపంచదేశాల సంఖ్యలో 44శాతం (మొత్తం 234దేశాలు). జులై 10 నుంచి ఆగస్టు 6 మధ్య ప్రపంచవ్యాప్తంగా 15లక్షల కేసులు రికార్డయ్యాయి. అందులో 12లక్షల కరోనా కేసులు కేవలం దక్షిణ కొరియా నుంచి నమోదయ్యాయి.

 

కొత్త వేరియంట్ టెన్షన్:
వైరస్‌ పీడ పోయిందని భావించిన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో కరోనా కాటు వేస్తోంది. రూపాలు మార్చుకొని కొత్త వేరియంట్‌లతో దాడి చేస్తోంది. అప్పట్లో డెల్టా వేరియంట్‌ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. తర్వాత ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదు కానీ కేసుల సంఖ్య మాత్రం భారీగానే రికార్డయింది. ఇక ప్రస్తుతం EG.5 వేరియంట్‌ ఉనికిలో ఉంది. ఇది బ్రిటన్‌, అమెరికాలో కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. దీన్నే 'ఇరిస్‌' లేదా 'యరిస్‌' (Eris) అని కూడా పిలుస్తున్నారు. ఈ జూన్-జులై మధ్య ఇరిస్‌ వ్యాప్తి డబుల్ ఐనట్టు WHO చెబుతోంది. అయితే దక్షిణకొరియాలో కరోనాతో ఎక్కువ మంది ఆస్పత్రులు పాలవడానికి ఈ EG.5 వేరియంట్ కారణం కాదన్నది WHO అంచనా.

ఇండియా సంగతి ఏంటి?
నిన్న(ఆగస్టు 11) ఇండియాలో 47కొత్త కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,505గా ఉంది. ఈ EG.5 వేరియంట్‌ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌కు చెందింది . ఇది స్పైక్ ప్రోటీన్‌లో అదనపు మ్యుటేషన్‌ను కలిగి ఉంటుంది. దీన్ని 'వేరియంట్ ఆఫ్‌ ఇంట్రెస్ట్' కింద వర్గీకరించారు. ఈ గ్రూప్‌ వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సీనియర్ కన్సల్టెంట్, రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ డాక్టర్ అక్షయ్ బుధ్రాజా చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని తప్పించుకోని ఈ తరహా వేరియంట్‌లు దాడి చేస్తాయట! పెద్ద సంఖ్యలో ప్రజలకు సోకుతుందని.. కేసుల సంఖ్య పెరిగితే ఆరోగ్య సమస్యలతో పాటు మరణాలు కూడా సంభవిస్తాయని అక్షయ్ చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే ఇండియాలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ వేరియంట్‌తో పెద్ద ముప్పు ఉండదన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

Also Read:నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..!

#corona #who #world-health-organisation #corona-cases #corona-new-variant #eris-variant #america-corona #south-korea-corona #new-covid-variant-eris-detected-in-india #new-covid-variant-eris
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe