Kejriwal Arrested : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు సిఎం కేజ్రీవాల్‌కు ఈ కేసులో రక్షణ కల్పించడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. దాదాపు 2గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అరెస్టు అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ తన ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. అరవింద్ కేజ్రీవాల్‌కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్రవారం పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీకి ఎవరు సీఎం ఎవరు? ఆప్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు ? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారు?
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ 9 సమన్లు జారీ చేసింది.ఢిల్లీ సీఎం ఏ ఒక్క సమన్లపైనా ఈడీ ముందు హాజరుకాలేదు. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసింది ఈడీ. కేజ్రీవాల్‌ను అరెస్టు తప్పదని ముందే గ్రహించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలు పెరుగుతున్నందున, డిసెంబర్ 1, 2023 నుండి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 'మేన్ భీ కేజ్రీవాల్' సంతకం ప్రచారాన్ని ప్రారంభించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే, ఆయన తన ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపించాలా? లేక రాజీనామా చేయాలా? అని ప్రజలను అడిగారు. ఈ సర్వేకు ముందు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. విచారణ పేరుతో ముఖ్యమంత్రిని జైలులో పెట్టే ప్రయత్నం చేస్తే, జైలుకు వెళ్లకముందే సీఎం రాజీనామా చేయాల్సి వస్తుందని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని అన్నారు.
కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారు?
'మై భీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారం సందర్భంగా, సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పోలీసు కస్టడీ నుండి నడిపించినా లేదా జైలు నుండి నడిపించినా.. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని.. ఆయనే కొనసాగుతారని ఎమ్మెల్యేలందరూ అభిప్రాయపడ్డారు. అరవింద్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎమ్మెల్యేలందరూ అభిప్రాయపడ్డారు.కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కేబినెట్ అంతా కూడా ముఖ్యమంత్రికి సపోర్టుగా నిలిచి..కేజ్రీవాల్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు సహాకరిస్తారని తెలిపారు. ఇంత జరిగినా కూడా జైలు నుంచే పరిపాలిస్తూ..ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రికొనసాగుతారని ఆప్ చెప్పకనే చెప్పింది.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలేంటి? అసలెంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం?