Telangana Former Governor Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న మాజీ గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమవుతుందని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని స్థానాల్లో బీజేపీ కి బీఆర్ఎస్ పార్టీతో పోటీ అని.. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పోటీ ఉంటుందని అన్నారు.
ALSO READ: నన్ను అరెస్టు చేయడం అన్యాయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
తమిళిసై మాట్లాడుతూ.. "తెలంగాణ ప్రజలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ తెలంగాణలో 22 సార్లు పర్యటించారు. ఎక్కువ శాతం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరు అయ్యారు. కాంగ్రెస్ - బీజేపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో బీజేపీకి పోటీ ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని పర్యటనకు సీఎం రాలేదు. గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వలేదు" అని అన్నారు.
"బీఆర్ఎస్ గురించి ప్రజలకు తెలుసు. అసత్యపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కుల మతలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల ఎత్తివేత అంశంపై ఇప్పటికే ప్రధాని , హోంమంత్రి, RSS పెద్దలు వివరణ ఇచ్చారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించింది. మండల్ కమీషన్ తెచ్చింది ఎవరు?. కుల రిజర్వేషన్లు కాంగ్రెస్ వ్యతిరేకించింది. బీజేపీ నుంచి అత్యధిక ఎస్సీ ఎంపీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రుణ మాఫీ ఎలా చేస్తారు? అంత రెవెన్యూ ఎక్కడిది? స్పష్టత లేదు. కాంగ్రెస్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అసత్యపు హామీలు ఇచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ.. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు ?" అని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.