/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Hatras-1.jpg)
UP Hathras : ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లోని హత్రాస్ (Hathras) లో మంగళవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 100మందికి మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ దారుణమైన ఘటన దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావాడానికి కారణమేంటి? ఎందుకలా తండోపా తండాలు తరలివవచ్చారు. ఇంతకు భోలే బాబా ఎవరు? ఆయన ప్రత్యకలేంటో తెలుసుకుందాం.
ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగినంటూ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన నారాయణ్ సాకార్ హరి (సాకార్ విశ్వ హరి) ‘భోలే బాబా’ (Bhole Baba) గా ప్రసిద్ధి చెందాడు. చిన్నతనంలోనే తండ్రితో కలిసి వ్యవసాయం చేసిన హరి.. జనాలకు తాను ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) లో పనిచేసినట్లు చెప్పుకు తిరిగేవాడు. అంతేకాదు 26 ఏళ్ల క్రితమే తాను ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు జనాలను నమ్మించాడు. అంతేకాదు తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ప్రచారం చేసుకున్నాడు. అలా చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. భారీ ప్రజాధారణ లభించడంతో పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు హితబోధ చేయడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అయితే యూపీ మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
పాదాల దగ్గరి మట్టికోసం..
అయితే ఈ మంగళవారం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు పోటీపడటంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగి ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మరణించారు.
Also Read : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!