Teeth Tips: చిటికెలో దంతాలను తెల్లగా మార్చుకోండి..ఈ చిట్కాలతో! కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతుంటారు. పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం, కాఫీ, టీలు తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. నిమ్మకాయ, బేకింగ్ సోడా ఉపయోగించి దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. By Vijaya Nimma 02 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Teeth Tips: మనిషికి చిరునవ్వు అందం.. మన దంతాలు శుభ్రంగా ఉంటేనే చిరునవ్వు బాగుంటుంది. కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రకాల పేస్టులు వాడినా దంతల రంగు మారదు. పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం. కాఫీ, టీలు తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే మద్యపానం చేసినా, సిగరెట్ తాగినా దంతాలు రంగు మారుతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని చిట్కాలను ఉపయోగించి దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మనం దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. నిమ్మకాయ, బేకింగ్ సోడా దీనికి అవసరం అవుతాయి. ఈ చిట్కాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో అర చెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్‌తో కానీ చేతి వేలుతో కానీ తీసుకొని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం అంతా తొలగిపోతుంది. దీంతో మన దంతాలు తెల్లగా మారుతాయి. అంతేకాకుండా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని కూడా వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కొబ్బరి నూనె, పసుపు కలిపి దంతాలను శుభ్రం చేసుకున్నా కూడా పసుపు రంగు తొలగిపోతుంది. ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అందులో మూడు చుక్కల కొబ్బరి నూనె వేయాలి. ఆ తర్వాత దాని పేస్టులా చేసుకుని దంతాలకు మృదువుగా రాసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇది కూడా చదవండి: కారం ఎక్కువగా తింటే ఇన్ని ప్రయోజనాలా? అంతేకాకుండా పండ్ల తొక్కలతో కూడా పళ్లను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ, అరటి, నారింజ పండ్ల తొక్కలతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి. వీటిలో ఉండే కొన్ని గుణాలు మీ నోటిలోని పిహెచ్‌ను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. వేప పుల్లలతో పళ్లు తోముకుంటే తెల్లగా మారుతాయి. ఈ వేప పుల్లలు బ్యాక్టీరియాలను నిరోధించే గుణాన్ని కలిగి ఉంటాయి. పళ్లకు పట్టిన గారను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. బేకింగ్ సోడా, పట్టికపొడిని తీసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్‌ను వేసుకుని దంతాలు తోముకోవాలి. దీంతో తెల్లగా మారుతాయి. అలాగే ఎండిన తులసి ఆకులను పొడిగా చేసుకుని దాంట్లో కాస్త ఆవాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని మృదువుగా దంతాలకు పట్టించాలి. ఆ తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు శుభ్రం అవ్వడమే కాకుండా తెల్లగా మెరుస్తాయి. అంతేకాకుండా మీ నోట్లో ఉండే క్రిములు కూడా నశిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. #teeth #tips #white మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి