Uttamkumar Reddy : బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..!!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం సమర్పించడానికి సిద్ధం కావాలని..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం జలసౌదాలో నీటిపారుదలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

New Update
Uttamkumar Reddy : బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..!!

Uttamkumar Reddy :  హైదరాబాద్ లోని జలసౌదా(Jalasuda)లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారుల(Irrigation officials)తో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో అధికారులు, ఇంజనీర్లతోపాటు నీటిపారుదలశాఖా కార్యదర్శి , ఈఎన్సీలు, సీఈవోలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రణాళికపై ఇంజనీర్లతో చర్చించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy). జూన్ నెల నాటికి కొత్త 50వేల ఎకరాలకు నీళ్లు అందించాలని తెలిపారు. డిసెంబర్ నాటికి 4.5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇచ్చిన సమయానికి ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులను, ఇంజనీర్లను హెచ్చరించారు. నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేసిందని..అందుకే రైతులకు ఫలాలు అందడం లేదన్నారు.

కొత్త ఆయకట్టును ఎంత త్వరగా సృష్టించవచ్చనే దాని ఆధారంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వర్గీకరించాలని ఆయన కోరారు. 6 నెలలలోపు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వగల ప్రాజెక్టులు, 1 సంవత్సరంలోపు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వగల ప్రాజెక్టులు, 2 సంవత్సరాలలోపు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వగల ప్రాజెక్టులు పై ప్రాతిపదికన, వ్యయాన్ని ఆప్టిమైజ్ చేయడానికి బడ్జెట్ కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. PMKSY పథకం కింద PRL నీటిపారుదల పథకం యొక్క కేంద్ర నిధుల కోసం పంపవలసిన ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. వేసవిలో అవసరమైన చోట నీటి ట్యాంకుల (Ponds) పూడిక తీసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్(Assembly Budget) సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం సమర్పించడానికి సిద్ధంకావాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

ఇది కూడా చదవండి: మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు…ఎప్పుడంటే?

అటు  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు (Free Bus) సౌకర్యం అమలవుతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఈ పథకం వరిస్తోంది. ఒక్క లగ్జరీ బస్సుల్లో తప్ప మిగతా అన్ని బస్సుల్లో కూడా వీళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలామంది మహిళలు హర్షం వ్యక్తం చేశారు. 

గిరాకీ లేదు:

అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులకి రావడంతో.. ప్రయాణికుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు (Auto Drivers) మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. మహిళా ప్రయాణికులు లేక గిరాకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా ఆదుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే ఈ అంశంపై తాజాగా మజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ స్పందించారు.

నెలకు రూ.15 వేలు ఇవ్వాలి :

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ సర్కార్‌ (Congress Govt) రోడ్డున పడేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ.. ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేస్తూ వేరవాళ్ల ఉసురు పోసుకోవడం సరికాదన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యాలను పెంచాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు