White Lung Syndrome: చైనాలో కరోనాను మించిన వైరస్‌..గడగడలాడుతున్న ప్రపంచ దేశాలు

చైనాలో పుట్టిన వైట్‌లాంగ్ సిండ్రోమ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లల ఊపిరితిత్తులలో పీఏఎంలో, కాల్షియం చేరి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటివి వస్తుంటాయి. ఈ సిండ్రోమ్‌కు మందు లేదు.

White Lung Syndrome: చైనాలో కరోనాను మించిన వైరస్‌..గడగడలాడుతున్న ప్రపంచ దేశాలు
New Update

White Lung Syndrome Virus: కరోనా ఈ దిక్కమాలిన వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిందే. ఈ వైరస్‌ మాట వింటే చాలు చాలామందికి గుండె దడ వస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అలాంటి ఓ సిండ్రోమ్‌నే అనే వైరస్‌ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా విస్తరిస్తున్న కొత్త వ్యాధి కూడా చైనాలోనే (China) పుట్టడం చర్చనీయాంశంగా మారింది. అదే వైట్‌లాంగ్ సిండ్రోమ్ (White Lung Syndrome). గత కొన్ని నెలల్లోనే ఎక్కువ మంది ఈ సిండ్రోమ్ బారిన పడ్డారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు అధికంగా 3 నుంచి 8 ఏళ్ల పిల్లల్లోనే కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఇప్పటి వరకు అమెరికాలోని ఒహియోలో దాదాపు 142 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. అసలు ఈ వైట్‌లాంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? ఇది ఎలా వ్యాపిస్తుంది..? దీని లక్షణాలు ఏంటి..? అనేది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వైట్‌లాంగ్ సిండ్రోమ్ వైరస్ కలకలం

వైట్‌లాంగ్ సిండ్రోమ్‌ వైరస్‌ని న్యుమోనియా (Pneumonia) అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల రెండూ కలిసినప్పుడు వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లల ఊపిరితిత్తులలో పీఏఎంలో, కాల్షియం చేరి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటివి వస్తుంటాయి. ఈ వైరస్‌ సోనికి పిల్లలకు ఎక్స్ రే తీసినప్పుడు ఊపిరితిత్తుల్లో (Lungs) తెల్లటి మచ్చలు, తెల్లటిరంగు ప్యాచ్‌లు కనిపిస్తుంటాయి. అలాగే.. ఈ సిండ్రోమ్ బారినపడిన వారిలో దగ్గు, జ్వరం, అలసట ఒల్లు నొప్పులతో బాధపడుతూ ఉంటారని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని ఇటీవల కొన్ని ఆరోగ్య సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం చెబుతున్నారు. అయితే సిండ్రోమ్‌కు మందు కనుగొనబడలేదు.

ఇది కూడా చదవండి: మీ భాగస్వామి వేరే వారికి దగ్గరవుతుందా..కారణమిదే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: పార్లమెంట్ లోపలి వెళ్లాలంటే ఎంత సెక్యూరిటీ దాటాలో తెలుసా?

#white-lung-syndrome #new-virus #china #corona-virus
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe