Rashtrapati Bhavan : ఢిల్లీ (Delhi) లోని రాష్ట్రపతిభవన్‌లో ఆదివారం ప్రధాని మోదీ (PM Modi) తో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది.
Also Read: కేంద్ర మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ..?
ఇక మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్ 3, తమిళనాడు 3, హర్యాణాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, ఝూర్ఖండ్ రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు (MP Seats) కేటాయించారు. ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అరుణచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.
Also Read: ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం.. స్టాక్ మార్కెట్ రికార్డ్ బ్రేక్ పరుగులు..