Puvvada Ajay Kumar: బీఆర్ఎస్ మాజీ మంత్రి మిస్సింగ్?

ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఖమ్మం క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలు గడుస్తున్నా పువ్వాడ దూరంగా ఉండడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు.

New Update
Puvvada Ajay Kumar: బీఆర్ఎస్ మాజీ మంత్రి మిస్సింగ్?

Ex Minister Puvvada Ajay Kumar: గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ పై కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు విజయం సాధించారు. ఓటమి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలైనా పువ్వాడ బయటకు రాకపోవడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉంది.

పార్టీ మారుతున్న నేతలు..

ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ మౌనం తో అక్కడి బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తి తో ఉంది. మరోవైపు వెంటాడుతున్న వరుస కేసులతో బీఆర్ఎస్ క్యాడర్ భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు భరోసాను ఇచ్చే నాయకులు లేకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస నేతల వలసలతో ఇప్పటికే గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మారుతున్న ఖమ్మం నేతలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

రెండు సార్లు ఎమ్మెల్యేగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఖమ్మం టౌన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తనకు పోటీ ఎవరు లేకుండా చేసుకొని.. ఖమ్మం నగరాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పదేళ్లపాటు చక్రం తిప్పారు పువ్వాడ. మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా చక్రం తిప్పుదాం అని అనుకున్న పువ్వాడ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే.. ఇటీవల కాలంలో నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో గత కొన్ని రోజులుగా పార్టీ క్యాడర్ కు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి పువ్వాడ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. మరి పువ్వాడ మౌనం వీడి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతారా? లేదా పార్టీ మారుతారనే ప్రచారాన్ని నిజం చేస్తారా? అనేది చూడాలి.

Also Read: లోక్‌‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు