WhatsApp Accounts Ban : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) ఫిబ్రవరిలో భారీగా వాట్సాప్ అకౌంట్స్ ను నిషేధించింది. ఐటి రూల్స్ 2021ని ఉల్లంఘించినందుకు ఫిబ్రవరి నెలలో 76 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు మెటా(Meta) యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌కు భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో దేశంలో రికార్డు స్థాయిలో 16,618 ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అంతకుముందు జనవరి నెలలో 6,728,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య 76,28,000అకౌంట్లను నిషేధించినట్లు తన నెలవారీ రిపోర్టులో పేర్కొంది. వీటిలో 14,24,000అకౌంట్స్ పై ఎలాంటి ఫిర్యాదులు అందకున్నా ఐటీ(IT) నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
పూర్తిగా చదవండి..WhatsApp : 76 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా?
వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Translate this News: