What's App In Phone: వాట్సాప్ ఎప్పుడూ చాలా అప్డేటెడ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ వెర్షన్‌ను డెవలప్ చేయడంతో పాటూ తమ అప్డేటెడ్ వెర్షన్‌కు అనుకూలంగా లేని మొబైల్ ఫోన్లలో సేవలను కూడా బంద్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా 35 సెల్ఫన్ రకాల్లో తమ సేవలను ఆపేస్తున్నామని వాట్సాప్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త జాబితాను కెనాల్‌టెక్ విడుదల చేసింది. అందులో చాలా ఫేమస్ బ్రాండ్ల ఫోన్లు కూడా ఉన్నాయి.
శాంసంగ్: గెలాక్సీ Ace ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎస్4 యాక్టివ్, గెలాక్సీ ఎస్4 మినీ, గెలాక్సీ ఎస్4 జూమ్.
మెటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్
యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్‌ఈ
హువావే: Ascend P6 S, Ascend G525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625
లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890
సోనీ: Xperia Z1, Xperia E3
ఎల్‌జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7
పైన చెప్పిన మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. వీటిని వాడుతున్నవారు వెంటనే తమ డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఆపేస్తామన్నది మాత్రం ఇంకా మెటా చెప్పలేదు. కానీ దీనికి సంబంధించిన మెసేజ్ మాత్రం ఫోన్లకు ముందుగానే వస్తుంది. అప్పటి నుంచి ఆ ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి.
Also Read:Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా?