Health Tips : బీపీ ఎక్కువై.. సర్రున కోపం వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!! అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. హైబీపీ వల్ల గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకడుతుంది. ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే టమోటో జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు. By Bhoomi 23 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి High Blood Pressure : హైబీపీ(High BP),హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? బీపీని సైలెంట్ కిల్లర్(Silent Killer) గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, లక్షణాలు లేకుండానే వస్తుంది. కాబట్టి చాలామందికి రక్తపోటు ప్రమాద సూచిక అస్సలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.. తట్టుకోలేనంత కోపం వచ్చినా.. శరీరంలో ఎలాంటి తేడా కనిపించినా... కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవల్సిందే. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు(Heart Attack), స్ట్రోక్(Stroke), ధమనుల్లో రక్తం గడ్డకట్టడానికి కారణం అవుతుంది. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. దీన్ని సకాలంలో గుర్తించలేనట్లయితే.. సకాలంలో చికిత్స తీసుకోకుంటే.. అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఆహార మార్పులు కచ్చితంగా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఈ జ్యూస్ ను తప్పకుండా మీ డైట్లో చేర్చుకోవల్సిందే. టమోటో జ్యూస్ ప్రయోజనాలు: టమోటో(Tomato) ల్లో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వంద గ్రాముల టమోటాల్లో 237 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. కాబట్టి టమోటా జ్యూస్(Tomato Juice) ను రెగ్యులర్ డైట్లో(Regular Diet) చేర్చుకోండి. ఇది మీ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. టమోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండెసంబంధిత సమస్యలు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతంది. రక్తపోటును నియంత్రణలోకి తీసుకురావడమే కాదు.. మీ శరీరంలోని రక్తప్రసరణలో కొలెస్ట్రాల్ కంటెంట్ ను చక్కగా నిర్వహిస్తుంది. టమోటా పండ్లు, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే టొమాటో జ్యూస్‌ని ఉప్పు వేయకుండా ప్రతి రోజూ తీసుకోవాలి!! టమోటా పండ్ల వినియోగం తర్వాత రక్తపోటు మెరుగుదల సమస్యకు సంబంధించి, జపాన్(Japan) లో అధిక రక్తపోటు ఉన్న 100 మందిని తన పరిశోధన అధ్యయనం కోసం ఒక అధ్యయనం ఉపయోగించింది. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు సుమారు నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉప్పు వేయకుండా టమోటా పండ్ల రసాన్ని తాగాలని సూచించి, ప్రతిరోజూ రక్తపోటు పరీక్ష చేసి ఫలితాలను ఒకవైపు రాసుకున్నారు. అదేవిధంగా, ఒక నెల తర్వాత, పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల రక్తపోటు సాధారణ స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. టమోటోలో కెరోటిన్, విటమిన్ ఎ, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై కూడా అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. గుండె సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ఇది కాకుండా, టొమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా ఉంది, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంటుంది. ప్రతిరోజూ టమోటా జ్యూస్ తాగితే: టమోటో జ్యూస్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను(Health Benefits) పొందవచ్చు. -టమోటాలో ఉండే వివిధ విటమిన్లు మీ శరీరంలోని జీవక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. -మీ శరీర కణాలు వాపు సమస్య నుండి ఉపశమనం పొందుతాయి. మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగేకొద్దీ, మీ కణాలు సమస్యను ఎదుర్కొంటాయి. - టమోటో రసం మీ వాపు సమస్యకు ఉత్తమ పరిష్కారం. మీ శరీరం ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహిస్తుంది. -మనం ఎప్పుడైనా డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు మన శరీరంలో మొదటగా తగ్గిపోయేది ఎలక్ట్రోలైట్స్. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. -కొందరు తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలిగి ఉంటే కోమా, స్ట్రోక్‌కు గురవుతారు. -ప్రతిరోజూ టమోటో జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపం ఉండదు. ఇది కూడా చదవండి : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా..! #health-tips #high-bp #high-blood-pressure #health-benefits-of-tomato-juice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి