YCP : ఆంధ్రపప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల ఫలితాల్లో (Election Results) టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) 150 పైగా సీట్ల అధిక్యంతో దూసుకుపోతోంది. మరోవైపు వైసీపీ (YCP) మాత్రం కేవలం 19 స్థానాల్లోనే మెజార్టీని కూడగట్టుకుంది. కూటమిలో టీడీపీ 132 సీట్ల మెజార్టీ ఉండగా.. జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. సిద్ధం అనే పేరుతో.. వైనాట్ 175 అనే నినాదంతో రంగంలోకి దిగిన వైసీపీకి ఈసారి ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. వైసీపీ ఇంత దారణంగా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ అసంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చకపోవడం వల్లే.. ఓటమిని చవిచూడాల్సి వచ్చిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో సీఎం జగన్ (CM Jagan) కూడా ఈ తప్పు తాను చేయకూడదని ముందుగా అభ్యర్థులను మార్చే ప్రక్రియపై ఫోకస్ పెట్టారు. దాదాపు 60కి పైగా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఇక్కడ వైసీపీకి అభ్యర్థు మార్పే ఎదురుదెబ్బ కొట్టినట్లు కనిపిస్తుంది. ఇక రెండవది చంద్రబాబును అరెస్టు చేయడం. ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్‌మెంటు కేసులో చంద్రబాబును అరెస్టు చేయించి.. దాదాపు 50 రోజులకిపైగా జైల్లో ఉంచడం రాష్ట్రంలో చాలా ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఇది కూడా వైసీపీకి పట్ల ఓటర్లలో అంసతృప్తి వ్యక్తమైనట్లు సర్వత్రా వినిపిస్తోంది.
Also read: ఏపీ ఫలితాలపై రోజా ట్వీట్.. ఏమన్నారంటే?
మరో ముఖ్యమైన అంశం రాజధాని మార్పు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైన కూడా ఏపీకి రాజధాని లేదు. 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించి అక్కడ పనులు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాజధానిని ఏర్పాటు చేసే అవకాశం జగన్‌కు వచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మూడు రాజధానులు చేస్తామని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి 2024 ఎన్నికలు కూడా దగ్గరపడటంతో.. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అవుతుందని ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా చేస్తామని తెలిపారు. దీంతో ఏపీ ప్రజలు చివరికి మళ్లీ చంద్రబాబు వైపు సానకూలత వ్యక్తం చేసినట్లు ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. ఏపీ ఎన్నికలు ఇంత ఆసక్తికరంగా మారడానికి, కూటమి గెలుపు వైపు పరుగులు తీయడానికి ఆయనది కీలక పాత్ర ఉంది. జగన్.. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దూషణలు చేయడం వల్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ప్రకారం.. భూములను రీసర్వే చేయించడం, పాస్‌బుక్‌లపై జగనన్నా ఫొటో వేయడం లాంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం పడిందని అనుకోవచ్చు.
Also Read: కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!