Holi 2024: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా? కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు మసాన్ హోలీలో పాల్గొంటారు. చితాభస్మంతో ఆడే హోలీ ఇది. రంగ్భరి ఏకాదశి తర్వాతి రోజు ఈ హోలీ జరుపుకుంటారు. రేపే(మార్చి 21) మసాన్ హోలీ. శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద ఇలానే హోలీ ఆడాడని భక్తుల నమ్మకం. By Vijaya Nimma 20 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Holi 2024: ప్రతీఏడాది హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది హోలికా దహన్ మార్చి 25న వచ్చింది. అయితే ప్రతీ ఊరులోనూ హోలీని ఒకే రకంగా జరుపుకోరు. అందరికి హోలి అంటే కలర్స్ చల్లుకోవడం గుర్తొస్తుంది. కానీ అక్కడ మాత్రం చితాభస్మంతో హోలీ ఆడుతారు. మధుర-బృందావనం హోలీ దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అటు కాశీలో హోలీ గురించి ఓ ఆసక్తికర విషయం ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం. కాశీలో మసల్ హోలీ ఆడతారు. చితాభస్మంతో ఈ హోలీ ఆడతారు. నిజానికి కాశీలో హోలీ వేడుకలు రంగభరి ఏకాదశి రోజున ప్రారంభమవుతాయి. ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు రంగ్భరి ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున శివుడు పార్వతీదేవిని కాశీకి తీసుకువచ్చాడని భక్తుల నమ్మకం. శివుడు, పార్వతి గులాల్ తో హోలీ ఆడారని చెబుతుంటారు. కాశీలో రంగ్భరి ఏకాదశి మరుసటి రోజు మసాన్ హోలీ జరుపుకుంటారు. ఈసారి రంగ్భరి ఏకాదశి మార్చి 20న ఉంది. మరుసటి రోజు అంటే రేపు(మార్చి 21న) మసాన్ హోలీ జరగనుంది. మసాన్ కీ హోలీ: కాశీలోని మార్నికర్ణిక ఘాట్ వద్ద చితాభస్మంతో హోలీ ఆడతారు. దీనిని మసాన్ హోలీ అంటారు. కాశీలో ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రంగ్భరి ఏకాదశి నాడు శివుడు పార్వతీమాతతో హోలీ ఆడాడని, ఈ కారణంగా దయ్యాలతో హోలీ ఆడలేకపోయాడని చెబుతుంటారు. అలాంటి పరిస్థితిలో మరుసటి రోజు శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద దెయ్యాలతో హోలీ ఆడారని నమ్ముతారు. కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు ఈ హోలీలో పాల్గొంటారు. వారు హోలీ గులాల్ వలె మసాన్ బూడిదను పూస్తారు. కాశీకి మసాన్ హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హోలీ పండుగ రోజున మణికర్ణిక ఘాట్ మొత్తం హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతుంది. ఇది కూడా చదవండి: ఉపవాసం ఇలా చేశారంటే ప్రమాదంలో పడ్డట్టే..హెచ్చరిస్తున్న నిపుణులు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #up #kashi #holi-2024 #marnikarnika-ghat #masan-holi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి