Know The Brain Hemorrhage : బ్రెయిన్ హెమరేజ్(Brain Hemorrhage) గురించి చాలా అందరికీ తెలుసు కానీ శరీరంలో వచ్చే మార్పుల గురించి మాత్రం తెలియదు. మెదడులో రక్తస్రావం అనేది మెడికల్ ఎమర్జెన్సీ(Medical Emergency). బ్రెయిన్ హెమరేజ్ అనేది ఒక ప్రాణాంతకమైన డిసీజ్, ఎక్కువ శాతం మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి. మెదడు లోపల సిరలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. వైద్య పరిభాషలో దీనిని ఇంట్రాక్రానియల్ హెమరేజ్(Intracranial Hemorrhage) అంటారు. మెదడులోని సిరలు పగిలినప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
మెదడులో సిరలు ఎందుకు పగిలిపోతాయి?
- మెదడు రక్తస్రావానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక వ్యక్తి తలకు ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినా బయటికి కనిపించకుండానే మెదడులోని సిరలు పగిలి లోపల రక్తస్రావం అవుతుంది. అధిక బీపీ(BP) కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు పగిలి రక్తస్రావం(Bleeding) అవుతుంది. అంతేకాకుండా మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల కూడా బ్రెయిన్ హెమరేజ్ ఏర్పడుతుంది. ధమనులలో కొవ్వు(Cholesterol) చేరడం, అథెరోస్క్లెరోసిస్ కారణంగా మెదడులో రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు మస్తిష్కం ఉబ్బి పగిలిపోవడం వల్ల కూడా రక్తస్రావం అవుతుంది. అలాగే మెదడు సిరల గోడల లోపల ఉండే అమిలాయిడ్ ప్రొటీన్ వల్ల కూడా రక్తస్రావం అవుతుందని నిపుణులు అంటున్నారు. ధూమపానం, అతిగా మద్యం సేవించడం లేదా కొకైన్ తీసుకోవడం కూడా మెదడులో రక్తస్రావానికి కారణం అవుతాయని చెబుతున్నారు.
మెదడులో రక్తస్రావాన్ని ఎలా నివారించాలి?
- బీపీని ఎప్పుడూ చెక్ చేయించుకోవాలి. ముఖ్యంగా హై బీపీ పేషెంట్లు తరచూ చెక్ చేయించుకోవాలి. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆల్కహాల్ తక్కువగా తాగాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ఒకవేళ షుగర్ ఉంటే అదుపులో ఉంచుకోవాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.