Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?
New Update

మనం ప్రతీరోజు చేసే పనిలో లాభ నష్టాలు ఉంటాయి. ఎక్కువ మంది ఉదయం, సాయత్రం వేడి నీటితో స్నానం చేస్తారు. మరికొందరు ఎంత చలిగా ఉన్నా చన్నీటితోనే స్నానం చేయటానికి ఇష్ట పడుతారు. అయితే.. చన్నీటితో స్నానం చేస్తే ఏమవుతుందనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. అయితే.. రోజూ చన్నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు ఏవరైనా ఏ సందేహం లేకుండా ప్రతిరోజు చన్నీటితో స్నానం చేయవచ్చు అంటున్నారు. శరీరంపై పడే చల్లని జల్లులు ఒంట్లోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చల్లని నీటి వల్ల ధమనులు బలంగా ఉంటాయి. దీంతోపాటు రక్తపోటు తగ్గి కొత్త ఉత్సాహం ఇస్తూ.. డిప్రెషన్‌ లక్షణాలు,

వాపు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: దంతాలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి

చన్నీటి స్నానం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కేశ రంధ్రాలు ధూళితో మూసుకుపోకుండా చన్నీళ్లు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా చన్నీటి స్నానంతో జీవక్రియ పనితీరు పెరుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఎక్కువగా సాయపడుతుంది. అయితే.. చలికాలంలో రోజూ చన్నీటితో స్నానం చేస్తే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ప్రాణాంతకంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటుకు కారణం కావచ్చని చెబుతున్నారు. ఇంకా మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న పెద్దవారు చన్నీటి స్నానానికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు.

వ్యాయామం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది

ఇలా రోజూ చన్నీటి స్నానం చేయడం వలన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దగ్గు, జలుబు, న్యుమోనియా, జ్వరం, గొంతులో చిరాకు తదితర వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలోనే కాదు.. ఏ కాలంలో అయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో తలస్నానం చేసేప్పుడు ముందు తలపై నీళ్లు పోసుకోకూడదు. ఇలా చేస్తే స్ట్రోక్స్‌ ప్రమాదాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు. దినచర్యలో భాగంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటూ చురుకుగానూ ఉంటారని చెబుతున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరులతో ఫుడ్‌ తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

#health-benefits #bath #winter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe