Medicine: ఆల్కహాల్‌ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..?

మద్యం తాగి మెడిసిన్‌ వేసుకుంటే ఆరోగ్యంపై చేడు ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారటంతోపాటు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, కాలేయ వ్యాధి, అల్సర్‌ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Medicine: ఆల్కహాల్‌ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..?
New Update

Medicine: నేటి కాలంలో ఎంతోమంది ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మద్యం తాగేవారు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రతి చిన్న సమస్యలు ఎక్కువగా మెడిసిన్‌ వేసుకుంటారు. అలా వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మద్యం తాగి మెడిసిన్‌ వేసకుంటే ఆరోగ్యం చేడు ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసలు కాకుండా ఉండాలని చెబుతున్నారు. మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అయితే.. కొందరు మద్యం సేవించి చిన్నచిన్న తప్పులు చేస్తారు. ముఖ్యంగా తాగిన తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే లాభాల కన్న నష్టాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

శరీరంపై ప్రతికూల ప్రభావం:

  • మద్యం సేవించిన తర్వాత మందులు వేసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మద్యం సేవించిన తర్వాత ఇతర మందులతో ప్రతిస్పందిస్తారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ తీసుకున్నాక ప్రమాదకరంగా మారుతుంది.

ఇది కూడా చదవండి:  పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే!

  • అందుకని మద్యం తాగినప్పుడు మందులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా.. ఆల్కహాల్ తాగినప్పుడు..అది కనీసం రోజంతా శరీరంలో ఉంటుంది. కొందరు మద్యం సేవించిన తర్వాత ఏవి పడితే అవి తీసుకుంటూ..పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారటంతోపాటు తల తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇలా చేస్తే కాలేయ వ్యాధి, అల్సర్‌ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కావునా.. తాగిన రోజు మెడిసిన్స్ కు దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  పాలల్లో లవంగాలు కలిపి తాగితే ఈ నొప్పులు ఉండవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #medicine #alcohol #lines #forehead
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe