Owaisi: ఇప్పుడు బుల్డోజర్లు ఏమయ్యాయి.... యూపీ వైరల్ వీడియోపై సీఎంకు ఒవైసీ సూటి ప్రశ్న...!

మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలున్ని చెంప దెబ్బ కొట్టాలంటూ టీచర్ ఒకరు తన విద్యార్థులకు సూచించారు. యూపీ ఖుబ్బాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు ట్రాస్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

author-image
By G Ramu
New Update
Owaisi: ఇప్పుడు బుల్డోజర్లు ఏమయ్యాయి.... యూపీ వైరల్ వీడియోపై సీఎంకు ఒవైసీ సూటి ప్రశ్న...!

Asaduddin Owaisi: మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలున్ని చెంప దెబ్బ కొట్టాలంటూ టీచర్ ఒకరు తన విద్యార్థులకు సూచించారు. యూపీ ఖుబ్బాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు ట్రాస్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

యూపీ సీఎం యోగీ ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు బుల్డోజర్ యాక్షన్ తీసుకోవడం లేదంటూ ఒవైసీ ప్రశ్నించారు. ఆ ముస్లిం విద్యార్థిని తండ్రి తన కుమారున్ని పాఠశాల నుంచి ఉపసంహరించుకున్నాడని అన్నారు. దీనిపై ముస్లి విద్యార్థి తండ్రి ఓ లేఖ రాశాడన్నారు. ఈ ఘటనలో తమకు ఎలాగూ న్యాయం జరగదు కాబట్టే తాము ఈ విషయాన్ని పొడిగించదలుచుకోలేదని ఆ తండ్రి లేఖలో పేర్కొన్నాడన్నారు.

తాను ఫిర్యాదు ఇస్తే న్యాయం జరగకపోగా అది పాఠశాల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని వాపోయారన్నారు. ఓ తండ్రి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరితే పాఠశాల వాతావరణాన్ని నాశనం చేసేదెవరని ఆయన ప్రశ్నించారు. యోగీ పాలనలో ప్రజలకు చట్టాలపై నమ్మకం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ ఉపాధ్యాయుడికి శిక్షకు బదులుగా ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.

ఈ ఘటనపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పిల్లల మనస్సులో చెడు సందేశాలను పంపుతాయన్నారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఈ ఘటనలో ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ!!

Advertisment
Advertisment
తాజా కథనాలు