"వన్ నేషన్.. వన్ ఎలక్షన్" పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..!!

వన్ నేషన్,వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. సరైన ఉద్దేశ్యంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అంతా సరిగ్గా జరిగితే 4నుంచి 5ఏళ్ల పరివర్తన దశ ఉంటే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందన్నారు.

"వన్ నేషన్.. వన్ ఎలక్షన్" పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..!!
New Update

దేశంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు కూడా హాట్ హాట్ గా మారతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓ వ్యూహానికి తెరలేపింది. అదే ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేత్రుత్వంలోని ఎనిమిది మంది సభ్యులతో ఓ హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.

ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ...సరైన ఉద్దేశంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతందని తెలిపారు. అలా అయితేనే తన మద్దతు ఉంటుందని చెప్పారు. సరిగ్గా జరిగినట్లయితే నాలుగైదు ఏళ్లలో పరివర్తన దశ ఉంటే అది దేశప్రయోజనాలకు మేలు చేస్తుందన్నారు. అంతకుముందు కూడా 17-18ఏళ్లుగా దేశంలో అమల్లో ఉందని తెలిపారు. భారత్ వంటి పెద్ద దేశంలో ప్రతిఏడాది జనాభాలో 25శాతం మంది ఓటువేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపే వారు ఎన్నికల శంఖారావంలో బిజీబిజీగా ఉన్నారని..ఈ విధానం అమలు చేస్తే..ఖర్చుకూడా తగ్గుతుందన్నారు. ప్రజలు కూడా ఒకసారి మాత్రమే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వం రాత్రికి రాత్రే మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తే సమస్యలు వస్తాయన్నారు. దీనిపై ప్రభుత్వం బిల్లు తీసుకోస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా ఉంటే అమలు చేయాలనీ అలా అయితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవకాశాలను పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పిస్తుంది.

#bjp #narendra-modi #prashant-kishor #one-nation-one-election
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe